The Pentateuch Numbers

From Egypt to Jordan

యేసును ఇలా కనుగొనండి: Rock Numbers 33 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 92వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయము

క్రీస్తు అనే బండపై నిలబడడమే మన పని. మొదటి కొరింథీయులు 10:4 ఇలా చెబుతోంది, “అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అరణ్యంలో బండయైన క్రీస్తు ఉన్నాడు. సంఖ్యాకాండము 32లో, గాదీయులు, రూబేనీయులు మరియు మనష్షేలోని సగం తెగవారు ప్రభువుపై ఎలా ఆధారపడకూడదని కోరుకున్నారో మనం చూశాము. వారు దేవుని సన్నిధిని అనుసరించటానికి బదులు వారు ఉన్న చోటనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అది మనలను సంఖ్యాకాండము 33లోకి నడిపిస్తుంది.

పాఠము

సంఖ్యాకాండము 33:1-10: అధ్యాయం 33 ఇశ్రాయేలీయులు వారి సైనిక విభాగాల ద్వారా ఐగుప్తునుండి బయటకు వచ్చినప్పుడు వారి ప్రయాణం యొక్క దశలు వ్రాయబడినవి (1 వ). దేవుడు కనిపించినప్పుడు మరియు వాటిని తదుపరి దశకు తరలించినప్పుడు ప్రారంభ బిందువులను గుర్తించడం ద్వారా వారి ప్రయాణాన్ని (2 వ) నమోదు చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మనము ఈ రోజు ఆరు చక్రాలను గూర్చి ధ్యానిద్ధాము. ఇశ్రాయేలీయులు తమ కొరకు దేవుడు చేసిన వాటిని మరచిపోతుండటం వలన వీటిని వ్రాయమని దేవుడు మోషేకు సూచించాడు (ద్వితీయోపదేశకాండము 4:9; 6:12; 8:2; కీర్తన 143:5).

దేవుడు ఇశ్రాయేలీయులను విషయాలను గుర్తుంచుకోవాలని కోరిన వివిధ మార్గాల గురించి ఆలోచించండి:

  • పస్కా మరియు పండుగలు
  • ప్రత్యక్ష గుడారము యొక్క మన్నా గల పాత్ర
  • చిగురించి, మొగ్గలు తొడిగి, ఫలాలను అందించిన అహరోను కర్ర
  • పది ఆజ్ఞలు
  • వారి వస్త్రాలపై కుచ్చులు

(1 కొరింథీయులు 11:25; లూకా 22:19, యేసు తనను తాను జ్ఞాపకం చేసుకోవడానికి ఇదే మనస్తత్వాన్ని తీసుకున్నాడని చూపిస్తుంది.)

తిరిగి సంఖ్యాకాండము 33:3-4కి, మోషే వారి ప్రయాణం యొక్క ప్రారంభ దశలను వ్రాశాడు: వారు మొదటి నెల పదిహేనవ రోజున, పస్కా మరుసటి రోజున, ఐగుప్తీయులను దేవుడు మొత్తగా చనిపోయిన తమ మొదటి బిడ్డలను పాతిపెడుతున్నప్పుడు, వారు రామసేసు నుండి బయలుదేరారు. తర్వాత ఇశ్రాయేలీయులు రామెసెసును విడిచిపెట్టి సుక్కోతులో విడిది చేశారు (5 వ). వారు సుక్కోతు నుండి బయలుదేరి, అరణ్యం అంచున ఉన్న ఏతాములో విడిది చేశారు (6 వ). వారు ఏతామును విడిచిపెట్టి, బయల్సెఫోనుకు తూర్పున ఉన్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగి దాని సమీపంలో విడిది చేశారు (7 వ). వారు పీహహీరోతును విడిచిపెట్టి, సముద్రం గుండా ఎడారిలోకి వెళ్లి, మూడు రోజుల తర్వాత మారాలో విడిది చేశారు (8 వ). ఇశ్రాయేలీయులు మారాను విడిచిపెట్టి, 12 నీటి బుగ్గలు మరియు 70 తాటిచెట్లు ఉన్న ఏలీముకు వచ్చారు, అక్కడ వారు విడిది చేశారు (9 వ). వారు ఏలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర విడిది చేశారు (వ. 10 వ). వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు, వారికి వెళ్లడానికి వేరే చోటు లేదని గమనించండి. వారి ప్రయాణం యొక్క ఈ మొదటి భాగం వారిని రామేసెసు నుండి ఎర్ర సముద్రం వరకు తీసుకువెళ్లింది మరియు వారు మేఘంచే నడిపించబడ్డారు.

సంఖ్యాకాండము 33:11-17: ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారిలో విడిది చేశారు మరియు ఈ ప్రక్రియలో గందరగోళం నుండి కొంత సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉన్నారు (11 వ). వారు సీను అరణ్యాన్ని విడిచిపెట్టి, దోపకాలో విడిది చేశారు (12 వ). వారు దోపకా నుండి బయలుదేరి ఆలూషు వద్ద విడిది చేశారు (13 వ). ఆలూషు తర్వాత వారు రెఫీదీమునకు వెళ్లారు, అక్కడ త్రాగడానికి నీరు లేదు (14 వ). వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారిలో విడిది చేశారు (15 వ). అప్పుడు, ఇశ్రాయేలీయులు సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోత్-హత్తావాలో విడిది చేశారు (16 వ). కహాతీయులు వారు వెళ్లిన ప్రతిసారీ గుడారాన్ని విప్పదీసి, పవిత్ర వస్తువులు రాకముందే దానిని తిరిగి అమర్చాలి (సంఖ్యాకాండము 4:4; 10:21). దీంతో వారి ప్రయాణం రెండోవ దశ ముగిసింది.

తరువాతి శిబిరానికి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్లాలో ఇశ్రాయేలీయులకు ఎలా తెలుసు? సంఖ్యాకాండము 9:17 ఇలా వివరిస్తుంది, “మేఘము కొన్ని దినములు మంది రము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి.” (సంఖ్యాకాండము 9:20). దేవుని సన్నిధిని బట్టి ఇది గొప్ప చిత్రం.

సంఖ్యాకాండము 33:18-31: 18వ వచనం యొక్క ప్రారంభం ప్రయాణం యొక్క మూడవ దశ, మరియు ఇది వేగులవారు పారాను ఎడారికి పంపబడిన చరిత్రను నమోదు చేస్తుంది. తర్వాత, నాల్గవ దశలో, ఇశ్రాయేలీయులు కాదేషు నుండి బెనేయాకానుకు తరలివెళ్లారు (26–31 వ).

సంఖ్యాకాండము 33:32-49: ప్రయాణం యొక్క ఐదవ దశ ఇశ్రాయేలీయులు ఎదోముకు వెళ్లిన ఎడారి ప్రయాణాన్ని కవర్ చేస్తుంది మరియు అహరీను మరణాన్ని నమోదు చేసింది. ప్రయాణం యొక్క ఆరవ దశ పునోన్ నుండి మోయాబు మైదానాల వరకు ఇశ్రాయేలీయులను అనుసరిస్తుంది. ఇతర వేదాంతవేత్తలు ప్రయాణాన్ని 42 దశలుగా విభజించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వారు ఒక ప్రదేశం నుండి బయలుదేరి మరొకచోట విడిది చేశారని మోషే 42 సార్లు రాశాడు.

సంఖ్యాకాండము 33:50-53: మోషేతో ప్రభువు మోయాబు మైదానాల్లో మాట్లాడాడు (50 వ), మరియు ఇశ్రాయేలీయులు కనానులోకి ప్రవేశించినప్పుడు, వారు నివాసులందరినీ వెళ్లగొట్టి, వారి విగ్రహాలు మరియు ఉన్నత స్థలాలన్నింటినీ నాశనం చేయాలని నొక్కి చెప్పాడు (51–52వ). అది దేవుడు వారికి ఇచ్చిన భూమి కావున వారు స్వాధీనపరచుకొని ఆ భూమిలో వారు స్థిరపరపడాలని ఉద్ఘాటించాడు (53 వ). ఈ భూమి వారి వారసత్వమని దేవుడు వారికి గుర్తు చేశాడు (54 వ). కానీ సూచనలు కూడా హెచ్చరికతో వచ్చాయి: ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోని నివాసితులను వెళ్లగొట్టకపోతే, వారు ఇశ్రాయేలీయులను వేధిస్తారు (55 వ) మరియు "మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను" అవుతారు. అదనంగా, దేవుడు ఇశ్రాయేలీయులను తాను నిర్దేశించినట్లు చేయడంలో విఫలమైనందుకు వారిని శిక్షిస్తాడు (56 వ).

ముగింపు

ఇదంతా రోమా ​​​​8:14కి దారి తీస్తుంది: " దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. " దీనర్థం మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మీరు పరిశుద్ధాత్మపై ఆధారపడకపోతే, క్రీస్తుతో మీ నడకతో మీరు ఏమి చేస్తున్నారు? "నేను వాగ్దాన దేశానికి వెళ్లాలని నిజంగా కోరుకోవడం లేదు" అని మీరు రూబేనీయులు లేదా గాదీయులు లాగా అక్కడేకూర్చున్నారా? మీరు ప్రభువుచేత నడిపించబడాలంటే, మీరు ఎక్కువగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆయన ఉనికిని మనం ఎక్కువగా అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనను మరియు ఆయన నడిపింపును మనం విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు, మనది కాదు.

ప్రశ్నలు

  1. ఇశ్రాయేలీయులకు ప్రతి ప్రదేశానికి ఎప్పుడు విడిది చేయాలి మరియు ఎప్పుడు బయలుదేరాలి అనే సమయం ఎలా తెలుసు? (సంఖ్యాకాండము 9:17)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Numbers 33:55-56

“But if you don’t drive out the inhabitants of the land before you, those you allow to remain will become thorns in your eyes and in your sides; they will harass you in the land where you will live. And what I had planned to do to them, I will do to you.”

ఇశ్రాయేలీయులు యెహోవా వారికి ఇస్తున్న దేశంలో కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మునుపు నివసించిన వారిలో ఎవరినైనా వారు భూమిలో విడిచిపెట్టినట్లయితే, ఆ నివాసులు తన ప్రజలకు వారి కళ్ళలో మరియు ప్రక్కలలో ముళ్ళలాగా ఒత్తిడికి గురవుతారని ప్రభువుకు తెలుసు.

జీవితంలో కొన్నిసార్లు, మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు, కొత్త ఇంటికి మారినప్పుడు లేదా కొత్త పాఠశాలలో ప్రారంభించినప్పుడు, మీరు మునుపటి వ్యక్తులను, స్థలాలను లేదా వస్తువులను కొత్త వారితో విలీనం చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఇరువర్గాలను సంతోషపెట్టాలని మరియు ఎవరికైనా బాధని లేదా గుండె నొప్పిని కలిగించకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే, వాస్తవానికి, ఇది రెండు వైపులా అసంతృప్తికి దారితీయవచ్చు, ఒత్తిడితో కూడిన పరిస్థితిని సృష్టిస్తుంది. పాత మార్గాలన్నింటినీ తొలగించి తాజాగా ప్రారంభించమని ప్రభువు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. బహుశా మీరు ఈ రోజు వినవలసి ఉంటుంది. కఠినమైన నిర్ణయం తీసుకోండి మరియు తాజాగా ప్రారంభించండి. మీరు ముందుకు అడుగులు వేసేటప్పుడు బలంగా మరియు ధైర్యంగా ఉండండి. ప్రభువు దానిని మంచి కోసం పని చేయిస్తాడు!

“అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము?”

— సంఖ్యాకాండము 33:55–56

తదుపరి లేఖన భాగములు

  • సంఖ్యాకాండము 33:52–53 — “ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి ​ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.”

సామెతలు 16:1–4 — “దయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.  ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.  యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.”

రోమా 8:28 — “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”