Scouting Out Canaan
యేసును ఇలా కనుగొనండి: Rock Numbers 12-13 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
మనము 80 రోజులు పూర్తి చేశాము!
పాఠము
సంఖ్యాకాండము 12:1–3: మోషే ఎవరిని వివాహం చేసుకున్నాడనే విషయమై మిర్యాము మరియు అహరోనులు విమర్శించారు. మిర్యాము పడిపోయినట్లు బైబిల్లో ప్రస్తావించబడిన ఏకైక సమయం ఇది. దేవుడు మోషే ద్వారా మాత్రమే ఎందుకు మాట్లాడాడని వారు అడిగారు. వారు మోషే నాయకత్వాన్ని ప్రశ్నించుటను దేవుడు విన్నాడు! మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
సంఖ్యాకాండము 12:4-14: దేవుడు మోషేను, అహరోనును మరియు మిర్యామును ప్రత్యక్షపు గుడారానికి పిలిచాడు. మిర్యాముకు అకస్మాత్తుగా కుష్టు వ్యాధి వచ్చింది. మిర్యాము తరపున మోషే దేవునికి వేడుకున్నాడు. మిర్యాము ఏడు రోజులపాటు పాళెము వెలుపల ఉంచబడింది.
సంఖ్యాకాండము 13:1-15: కనానును వేగు చూచుటకు ప్రతి గోత్రము నుండి ఒక వ్యక్తిని పంపమని దేవుడు మోషేకు సూచించాడు. పన్నెండు మంది వేగులవారిని పంపారు. ద్వితీయోపదేశకాండము 1:21 వేగులవారు భయపడకూడదు లేదా నిరుత్సాహపడకూడదు. దేహ ధారుఢ్యం గలవారు, క్రీడాకారులు నావికులైన వారిని మోషే వేగులవారిగా ఎంచుకున్నాడు :
- షమ్మూయ, రూబెన్ తెగ
- షాపాతు, షిమ్యోను గోత్రము
- కాలేబు, యూదా గోత్రము
- ఇగాలు, ఇశ్శాఖారు గోత్రము
- హూషేయా, ఎఫ్రాయిము గోత్రము
- పల్తీ, బెన్యామీను గోత్రము
- గదీయేలు జెబులూను గోత్రము
- గదీ, మనష్షే తెగ
- అమ్మీమయేలు, దాను గోత్రము
- సెతూరు, ఆషేరు గోత్రము
- నహబీ, నఫ్తాలి గోత్రము
- గెయువేలు, గాదు గోత్రము
సంఖ్యాకాండము 13:16-20: మోషే హోషేయకు "యెహోషువా" అని పేరు మార్చాడు. హోషేయా అంటే "రక్షణ కొరకు కోరిక." యెహోషువా అంటే "ప్రభువు రక్షిస్తాడు, ఆయన రక్షణ" అని అర్థము. యెహోషువా మరియు యేసు ఒకే పేరుతోనున్న రెండు రూపాలు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ప్రకారం మోషే హోషేయా పేరును యెహోషువాగా మార్చాడు.”1
ఎక్కడికి వెళ్లాలో మోషే వేగులవారికి చెప్పాడు. వారు భూమిని మరియు ప్రజలను తనిఖీ చేయవలసి ఉంది, వారు ఎలా ఉన్నారో వివరించాలి. కొంతమందా లేదా అనేకులా? బలంగా ఉన్నారా లేదా బలహీనంగా ఉనారా? భూమి మంచిదా చెడ్డదా? నగరాలు ఎలా ఉన్నవి? శిబిరాలు లేదా కోటలు ఎలా ఉన్నవి? చెట్లు ఉన్నాయా, చెట్లు లేవా? పండ్లు ఉన్నాయా, పండు లేవా? వారు ధైర్యంగా ఉండి కొన్ని ఫలాలను తిరిగి తీసుకురావాలి.
సంఖ్యాకాండము 13:21–22: వారు సీను అరణ్యాన్ని రెహోబు వరకు, హమాతు ప్రవేశం వరకు మొత్తం 87 మైళ్లు వెగు చేశారు. ఐగుప్తులోని యోవానుకు ఏడు సంవత్సరాల ముందు నిర్మించబడిన నెగెబు ద్వారా హెబ్రోను (ఉండవలసిన ప్రదేశం!). అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు (ఆదికాండము 13:18). అబ్రాహాము మరియు ఇస్సాకు అక్కడ సమాధి చేయబడ్డారు (ఆదికాండము 49:31). దావీదు యొక్క రాజధాని అక్కడే ఉంది (2 సమూయేలు 2:11). కాలేబు వారసత్వం అక్కడ ఉంది (యెహోషువా 14:13).
సంఖ్యాకాండము 13:23-25: ఎష్కోలు లోయలో, వేగులవారు ఒక ద్రాక్ష గుత్తిని నరికి, ఒక స్తంభంపై ఉంచారు. ఈ చిత్రం నిజానికి ఇశ్రాయేలు పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క లోగో. ఇద్దరు మనుష్యులు ద్రాక్షపండ్లను ఒక దండెతో తీసుకువెళ్లారు. వారు దానిమ్మ మరియు అంజూరపు పండ్లను కూడా సేకరించారు. అక్కడ కోసిన ద్రాక్షగెల కారణంగా ఎష్కోలు అని పేరు పెట్టారు. 40 రోజుల తర్వాత వేగులవారు తిరిగి వచ్చారు.
సంఖ్యాకాండము 13:26–27: సమాచారమును తిరిగి తీసుకువచ్చుట: పండ్ల నివేదిక: అది పాలు మరియు తేనెతో ప్రవహించే భూమి అని నిరూపించడానికి వారు వారికి ఒక పండును చూపించారు. చాలా సార్లు, దీని గురించి మాట్లాడబడింది:
నిర్గమకాండము 3:8: పండు మరియు శత్రువులు
నిర్గమకాండము 3:17: ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించబడ్డారు
నిర్గమకాండము 13:5: నేను దానిని మీకు ఇవ్వబోతున్నాను
నిర్గమకాండము 33:1: పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.
ప్రతిసారీ శత్రువుల ప్రస్తావన వచ్చింది. దేవుడు మనల్ని ఎప్పుడూ ముందుంచేందుకు సిద్ధపరుస్తాడు.
సంఖ్యాకాండము 13:28-29: ఒక భయ నివేదిక: నగరాలు పెద్దవి మరియు కోటలతో ఉన్నాయి, అక్కడి ప్రజలు బలంగా ఉన్నారు. అనాకు వంశస్థులు అక్కడ ఉన్నారు! వారు పెద్ద, పొడవైన యోధులు. అలాగే, అమాలేకీయులు, హిత్తీయులు, జెబూసీలు, అమోరీయులు మరియు ఓహ్ అవును, కనానీయులు అక్కడ ఉన్నారు.
సంఖ్యాకాండము 13:30-33: కాలేబు నిలబడి ప్రజలను నిశ్శబ్దపరిచాడు. "మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను" అని అతను చెప్పాడు. కాలేబు ఇలా జరగవచ్చని మరియు భూమి తమదేనని తాను నమ్ముతున్నానని చెప్పాడు. పదిమంది వేగుల వారు దీనిని నమ్మలేదు ఎందుకంటే కనాను మనుష్యులు బలంగా కనిపించారు. వారికి విశ్వాసం లేదు.
వారు భయంతోకూడిన వ్యతిరేక నివేదిక- నివేదిక ఇచ్చారు. పురుషులు భారీగా ఉన్నారని వారు పునరావృతం చేశారు. అనాకులు నెఫిలీము వంశస్థులు. నెఫిలీములు అక్కడ ఉన్నారు! మళ్ళీ, "మేము వారికి మిడతలవలె కనిపించాము." అనే నివేదిక నిచ్చారు.
ముగింపు:
దేవుడు మనకు ఏదైనా వాగ్దానం చేస్తే, అది కార్యరూపం దాల్చేలా చేస్తాడు! మీరు మీ వేగులవారిని చూసినప్పుడు, మీరు ఏ విధంగా నివేదికనిస్తారు? 2 తిమోతి 1:7 ఇలా చెబుతోంది, “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.” మనకు దేవుని నుండి వాగ్దానం మరియు శక్తి, ప్రేమ మరియు మంచి మనస్సు ఉన్నాయి. మనకు వ్యతిరేకంగా ఎవరున్నారన్నది ముఖ్యమా? ఈ విధంగా మనం భయాన్ని ఎదుర్కొంటాము.
కాదేషు-బర్నియా వేగు నివేదికకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. భూమిలోకి వెళ్లడానికి సిద్ధమయ్యే ముందు అది గూఢచారులకు ఆధార క్యాంపు. మోషేకు వ్యతిరేకంగా కోరహు తిరుగుబాటు చేసిన ప్రదేశం కూడా కాదేషు (సంఖ్యలు 16). మిర్యాము ఇక్కడే సమాధి చేయబడింది (సంఖ్యాకాండము 20:1). మోషే బండను కొట్టడం ద్వారా దేవుణ్ణి అవమానించాడు (సంఖ్యాకాండము 20:8-12). ఇది తిరుగుబాటు మరియు ప్రతిఘటన యొక్క ప్రదేశంగా కనిపిస్తోంది, అయినప్పటికీ దేవుడు పదే పదే ఫలాలను వాగ్దానం చేశాడు.
వైర్స్బే ఇలా అంటాడు, "పరీక్షించలేని విశ్వాసం, విశ్వసించబడదు."2 దేవుడు మన విశ్వాసాన్ని దాని నిజమైనదిగా నిర్ధారించుకోవడానికి మరియు అది మనకు ఎదగడానికి సహాయం చేయడానికి పరీక్షిస్తాడు (1 పేతురు 1:1-9). పరీక్షించబడిన విశ్వాసం మనల్ని ఆయనలాగా మారుస్తుంది. సముద్రం దాటమని, భూమిని తీసుకోమని దేవుడు చెబుతున్నాడు, ఎందుకంటే అది మనది, కానీ దానికి బలమైన విశ్వాసం అవసరం!
రోమా 4:21: "దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను."
హెబ్రీయులు 11:6: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.”
ఈ సమయంలో, కనీసం పది మంది పురుషులు, "అది సాధ్యం కాదు" అని చెప్పారని మాకు తెలుసు. కానీ కాలేబు నిలబడి, ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించాడు. వేగులవారి నివేదికకు పరిశీలనతో సంబంధం లేదు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడనే విశ్వాసం ఇశ్రాయేలీయులకు ఉందా లేదా అనే దానితో దానికి సంబంధించిన ప్రతిదీ కట్టుబడియుంది.
ప్రశ్నలు
-
సంఖ్యాకాండము 12:1–2లో, అహరోను మరియు మిర్యాము తమ సోదరుడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. (1 దినవృత్తాంతములు 16:22; కీర్తన 105:15) సంఖ్యాకాండము 12:6-8లో మోషే మరియు ఇతర ప్రవక్తల మధ్య ప్రభువు ఏ పోలిక చేసాడు?
దినవాక్యం
Laura Martin Numbers 13:30-31
“Then Caleb quieted the people in the presence of Moses and said, ‘We must go up and take possession of the land because we can certainly conquer it!’ But the men who had gone up with him responded, ‘We can’t go up against the people because they are stronger than we are!’”
కనాను దేశాన్ని పరిశోధించడానికి పన్నెండు మందిని పంపమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. నలభై రోజుల తర్వాత, వారు రెండు వేర్వేరు నివేదికలతో ఇశ్రాయేలీయుల వద్దకు తిరిగి వచ్చారు. మెజారిటీ స్కౌట్లు భయంతో, బెదిరింపులతో మరియు భూమిలోకి వెళ్లడంపై ప్రతికూల వైఖరితో తిరిగి వచ్చారు. కానీ కాలేబు మాట్లాడాడు, పూర్తి విశ్వాసంతో, వారు ఖచ్చితంగా భూమిని జయించగలరని నమ్మాడు.
ప్రభువు మిమ్మల్ని కొత్త పరిస్థితుల్లోకి నడిపించినప్పుడల్లా, మీరు ప్రతికూల లేదా సానుకూల దృక్పథంతో ప్రతిస్పందించడానికి ఎంచుకోవచ్చు. మీరు భయాన్ని లేదా విశ్వాసాన్ని ఎంచుకోవచ్చు. ఇది ప్రారంభమవడానికి ముందే మీరు ఓడిపోయారని మీరు విశ్వసించవచ్చు లేదా మీరు అన్ని పరిస్థితులలో విజేతగా విశ్వసించవచ్చు. మీ పక్కన ఉన్న దేవుడు మరియు మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో, అసాధ్యమని అనిపించే పరిస్థితులలో మీకు కావలసినవన్నీ ఉన్నాయి. గుర్తుంచుకోండి, దేవునితో, ప్రతిదీ సాధ్యమే. దేవుడు మీకు భయం యొక్క ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తి, ప్రేమ మరియు మంచి తీర్పును ఇచ్చాడు. ప్రభువు మిమ్మల్ని కొత్త సాహసాల వైపు నడిపిస్తున్నందున ఈ రోజు ఈ వాగ్దానాలలో నడుచుకోండి!
“ కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.”
— సంఖ్యాకాండము 13:30–31
తదుపరి లేఖన భాగములు
- లూకా 1:37 — “దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.”
రోమా 8:37 — “అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.”
2 తిమోతి 1:7 — “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.