Teaching With Authority
యేసును ఇలా కనుగొనండి: Servant Mark 1 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మనము సువార్తల యొక్క అధ్యయనాన్ని కొనసాగిస్తూ, మార్కు సువార్తలోకి వెళ్తున్నాము. ఇది యేసు సేవకుడిగా ఉన్న చిత్రం. సువార్త మార్కు అను మారు పేరుగల యోహాను చేత వ్రాయబడింది మరియు అపొస్తలుల కార్యములు 12:12లో, మార్కు యోహాను తల్లి ఇల్లు ప్రార్థనా స్థలంగా చూపబడింది. కాబట్టి, మార్కు తన సువార్తకు ప్రార్థనపై ప్రత్యేకమైన దృక్పథాన్ని తీసుకువచ్చాడు. ప్రార్థించే తల్లి ఉన్నప్పుడు, ఆ ఆత్మను వారి పిల్లలపైకి తీసుకువెళుతుంది. మొదటి సువార్త ప్రయాణంలో, బర్నబా మరియు సౌలు (పాల్ అని కూడా పిలుస్తారు; అపొస్తలుల కార్యములు 13:9) తమతో మార్కు యోహాను తీసుకువెళ్లారు (అపొస్తలుల కార్యములు 12:25). ఇంకా, యోహాను మార్కు బర్నబా యొక్క బంధువు (కొలస్సీ 4:10). యోహాను మార్కు గొప్ప ఆత్మీయ వారసత్వాన్ని కలిగయున్నవాడు.
యోహాను అనబడిన మార్కు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను సువార్త ప్రయాణాన్ని ముగించలేకపోయాడు మరియు త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు, బర్నబా మరియు పౌలు మధ్య భేధమేర్పడింది (అపొస్తలుల కార్యములు 13:13; 15:38-40). యోహాను అనబడిన మార్కు పౌలుకు బెయిల్ ఇచ్చినప్పటికీ, అతను పౌలు సహోద్యోగులలో ఒకరిగా గుర్తించబడ్డాడు (ఫిలేమోను 24) మరియు ఇప్పటికీ పరిచర్యలో ఉపయోగకరంగా ఉన్నాడు (2 తిమోతి 4:11). అలాగే, యోహాను అనబడిన మార్కు మరియు పేతురు దగ్గర శిష్యత్వ సంబంధాన్ని కలిగి ఉన్నాడు (1 పేతురు 5:13).
యోహాను అనబడిన మార్కు తన సువార్తను పునరుత్థానమైన రెండు మూడు దశాబ్దాల తర్వాత రాశాడు, బహుశా రోమా నుండి వ్రాశాడు, ఎందుకంటే ఇది అన్యులుగా ఉన్న రోమా విశ్వాసులకు వ్రాయబడింది. మార్కు సువార్త అంతటా, యేసు "శ్రమపడుచున్న సేవకుని"గా చిత్రీకరించబడ్డాడు; " మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను." (మార్కు 10:45). ఈ సువార్త అంతటా, యేసు యొక్క మానవ సంబంధ భావోద్వేగాలు చూపించబడ్డాయి (మార్కు 1:41). శ్రమపడుచున్న సేవకునిగా, యేసు ప్రజల పట్ల కనికరంతో కదిలించబడ్డాడు మరియు వారితో మమేమవ్వగలిగాడు (మార్కు 1:41; 3:5). యేసుకు మానవ భావోద్వేగాలు మరియు శారీరక పరిమితులు రెండూ ఉన్నాయి: ఆయన అలసిపోయాడు (మార్కు 4:38), ఆకలితో ఉన్నాడు (మార్కు 11:12), మరియు నిరాశ చెందాడు (మార్కు 8:12).
పాఠము
మార్కు 1:1-8: మొదటి 8 వచనాలు మెస్సీయ రాకడను ప్రవచనం ద్వారా (2-3 వ) మరియు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా మార్గాన్ని సిద్ధం చేయడం (4-8 వ) ద్వారా తెలియజేయబడినవి. యోహాను మార్కు కథలు తరచుగా మనం మత్తయిలో చదివిన దానికంటే చాలా తక్కువగా ఉంటాయి.
మార్కు 1:9-15: యోహాను మార్కు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా యేసు యొక్క బాప్తిస్మము (9-11 వ), అరణ్యంలో యేసు యొక్క శోధనలు (12-13 వ) వ్రాయబడ్డాయి. అప్పుడు, యోహాను మార్కు బాప్తిస్మమిచ్చు యోహాను అరెస్టు చేయబడ్డాడని పేర్కొన్నాడు మరియు యేసు తన పరిచర్యను ప్రారంభించడానికి గలిలయకు వెళ్ళాడు (14 వ).
మార్కు 1:16-20: యేసు తన శిష్యులను పిలవడం ప్రారంభించాడు.
మార్కు 1:21-22: యేసు తన పరిచర్యను గలిలయలోని కపెర్నహూములో ప్రారంభించాడు. మార్కు పుస్తకంలోని ఒక సాధారణ దారము ఏమిటంటే, యేసు బోధించడాని ఎల్లప్పుడూ కి సమాజ మందిరానికి వెళ్లాడు. (మార్కు 2:13; 4:1-12; 6; 10-12; 14.) పెర్నహూము ఒక ముఖ్యమైన మరియు సంపన్నమైన మత్స్యకారుల గ్రామం, ఇది గలిలయ సముద్రం యొక్క వాయువ్య ఒడ్డున మరియు ఒక ప్రధాన రహదారిపై ఉంది. దాని స్థానం యేసు ప్రధాన కార్యాలయానికి ముఖ్యమైన అంశంగా మారింది. సమాజ మందిరంలో ఉన్నవారు ఆయన బోధతో ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన "ధికారము గలవానివలె" (22 వ) వారికి బోధించాడు. యూదులు మౌఖిక సంప్రదాయాన్ని ఉపయోగించి ఇతర రబ్బీలు చెప్పినవాటిని రబ్బీలు చెప్పేవారు. యేసు స్వయంగా సత్యంగా మాట్లాడాడు; తన మాటలు వినేవారికి ఆయన సందేశం కొత్త కోణం. ఒక వ్యాఖ్యానం ప్రకారం, యేసు వ్యక్తిగతంగా ఉంటూనే సూటిగా మరియు శక్తితో మాట్లాడాడు. నిజానికి, మార్కు సువార్తలో 42 శాతం ప్రత్యేకంగా ఆయన బోధనను సూచిస్తోంది.1
మార్కు 1:23-24: అప్పుడే, అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి సమాజ మందిరంలోకి ప్రవేశించాడు. దయ్యం (అపవిత్రాత్మ) యేసును మానవుడిగానూ, దైవంగానూ "దేవుని పరిశుద్ధుడు"గా గుర్తించింది. మాక్ఆర్థర్ దెయ్యం యొక్క ప్రశ్నను ఇలా వ్యాఖ్యానించాడు, "మీరు మాతో ఎందుకు జోక్యం చేసుకుంటారు?"2 నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ప్రకారం, యేసు చేసిన అద్భుతాలలో 20 శాతం "దయ్యాల వల్ల బాధింప బడుచున్న వారికి సహాయం చేయడంలో యేసు పాల్గొన్నాడు."3 మీరు ప్రతిరోజూ పరిచర్యను చేసి సువార్తను ప్రకటిస్తే, దయ్యాల కార్యకలాపాలను మీరు ఎదుర్కొంటారు. యేసు తన సమయములో దాదాపు పావు వంతును దయ్యములతో వ్యవహరిస్తూ గడిపాడు, ఎందుకంటే దయ్యాలచే దాడి చేయబడిన వారి పట్ల ఆయనకు కనికరం ఉంది.
ఒక సమాజములోలో కనీసం పది మంది పురుషులు ఉన్న ప్రతిసారీ ఒక సమాజ మందిరం ప్రారంభించబడింది. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం మొదటి శతాబ్దపు సమాజమందిరాలలో ఏమి కనుగొనబడుతుందో వివరిస్తుంది:
- పెద్దలు: ప్రార్థనా మందిరం యొక్క విధానాలను నియంత్రించేవారు.
- పాలకుడు: భవనం మరియు పరిచర్యల ప్రణాళికలను చూసుకోవడానికి పెద్దలచే నియమించబడిన వ్యక్తి.
- ఒక పరిచారకుడు: పరిశుద్ధ గ్రంథపు చుట్టలను చూసేవాడు, దీపాలను వెలిగించేవాడు మరియు భవనాన్ని శుభ్రంగా ఉంచేవాడు, అలాగే పిల్లలకు చదవడం నేర్పించేవాడు మరియు శిక్షలను అమలు చేసేవాడు.
- ఒక ప్రతినిధి: పరిచర్యకు ముందు పాలకుని చేత ఎంపిక చేయబదిన ఒక సమర్థుడైన వ్యక్తి. లేఖనములను చదవడానికి, ప్రార్థనకు నాయకత్వం వహించడానికి మరియు సమాజానికి (తాత్కాలిక కార్యాలయం) బోధించడానికి నియమింపబడినవాడు. యేసు నజరేతు సమాజ మందిరంలో ప్రతినిధిగా పనిచేశాడు (లూకా 4:16-30).
- తర్జుమా చేయువాడు: చాలా మంది యూదులు అరామిక్ మాట్లాడినందున హీబ్రూ లేఖనాలను అనువదించగల వ్యక్తి.
- కోశాధికారులు: ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు పేదల అవసరాలను తీర్చడానికి డబ్బును తీసుకున్నవారు .4
యేసు సమాజ మందిరాలలో బోధించడానికి చాలా సమయం గడిపాడు కాబట్టి, అతను ఈ అన్ని స్థానాల్లో ఉన్న వ్యక్తులను ఎదుర్కొన్నాడు మరియు సంభాషించాడు. పౌలు కూడా ప్రతి సమాజములోకి ప్రవేశించి నేరుగా సమాజ మందిరానికి వెళ్లాడు. మతపరమైన అధికారులతో పరస్పర చర్చలు తరచుగా ప్రార్థనా మందిరాల్లో జరిగేవి. షెమా (ద్వితీయోపదేశకాండము 6:4-9) పఠనంతో సేవ ప్రారంభమైంది, ఒక బోధకుడు తమ చేతులు చాచి యెరూషలేమునకు ఎదురుగా నిలబడి ప్రార్ధన సమయానికి నాయకత్వం వహిస్తాడు, ఆపై ఎన్నుకొనబడిన వక్త నిలబడి ధర్మశాస్త్రములోని ఒక భాగాన్ని చదువుతారు, దీనిని మరియు ప్రవక్తల యొక్క ఒక భాగము తర్జుమా చేయువానిచేత అనువదించబడుతుంది. అనంతరం ప్రతినిధి వ్యాఖ్యానిస్తాడు మరియు ఉపన్యాసిస్తాడు. ఆ తర్వాత, యాజకుడు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు మరియు సంఘం “ఆమేన్” చెప్పుటతో ముగుస్తుంది.5
మార్కు 1:25-28: అపవిత్రాత్మ ఉన్న వ్యక్తి యేసు బోధకు అంతరాయం కలిగించాడు. “ఊరకుండుము!” అని యేసు దయ్యాన్ని మందలించాడు. (లేదా “మతిమరుపుగా ఉండు!”) మరియు ఆ వ్యక్తిని విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు (25 వ). దయ్యం యొక్క ఆత్మ బయటకు వచ్చింది, మరియు మనిషి మూర్ఛతో వణుకుతున్నాడు (26 వ). దయ్యాల ఆత్మలతో వ్యవహరించడం దారుణంగా ఉంటుంది! సమాజమందిరములోని ప్రజలు తాము చూసిన దాని గురించి ఏమి జరిగిందోయని ఆశ్చర్యపోయారు మరియు యేసు అధికారంతో బోధించడం గురించి వాదించుకోవడం ప్రారంభించారు (27 వ). యూదుల సమాజ మందిరంలో ప్రజలు చూసిన వాటి ఆధారంగా మాటలు వ్యాపించాయి––ఎందుకంటే యేసు దయ్యాన్ని సులభంగా వెళ్లగొట్టాడు (28 వ). మీరు అధికారం మరియు శక్తితో నడిచినప్పుడు, మతం యొక్క ఆత్మ వెనుకకు నెట్టివేయబడుతుంది, కానీ ప్రజలు సందేశాన్ని వినడానికి ఆకలితో ఉంటారు.
మార్కు 1:29-34: సమాజ మందిరం తర్వాత, యేసు, సీమోను, యాకోబు, యోహాను మరియు ఆంద్రెయలతో సీమోను మరియు ఆంద్రెయల ఇంటికి వెళ్లారు. యేసు సీమోను పేతురు అత్తగారిని స్వస్థపరచడం ద్వారా ఆమెకు సేవ చేశాడు (వ. 29-31) (అవును, సీమోను పేతురు వివాహం చేసుకున్నాడు; 1 కొరింథీయులు 9:5). ఆ సాయంత్రం, ప్రజలు త్వరగా రోగులను మరియు దయ్యం పట్టిన వారిని స్వస్థత కోసం యేసు వద్దకు తీసుకురావడం ప్రారంభించారు. వారు చాలా త్వరగా వచ్చారు, పట్టణమంతా ఆ యింటివాకిట కూడి యుండెను. (వ. 32-33). యేసు దయ్యాలను వెళ్లగొట్టాడు కానీ "దయ్యాలు మాట్లాడటానికి అనుమతించలేదు, ఎందుకంటే వారు ఆయనను ఎరుగుదురు" (వ. 34). ఇది మనము అనుసరిస్తున్న సేవకుని యొక్క ఖచ్చితమైన చిత్రం.
ముగింపు
మార్కు పుస్తకము కొరకు మిండి యొక్క అద్భుతమైన పెయింటింగ్ చూడండి. గుర్తుంచుకోండి, బైబిల్ పుస్తకానికి ఒక పెయింటింగ్ ఉంది. ముఖ్యంగా చేతిని చూడండి––రోగులను స్వస్థపరిచిన మరియు దయ్యాలను వెళ్లగొట్టిన చేతి ద్వారా క్రీస్తు శక్తి తీసుకురాబడింది. ఆయన సీమోను పేతురు అత్తగారిని ముట్టుకున్నాడు మరియు ఆమె స్వస్థత పొందింది. క్రీస్తు, శ్రమపెట్టబడిన సేవకుడు, ఎవరినైనా మరియు ప్రతి ఒక్కరినీ తన దగ్గరికి తీసుకురావడానికి ఎప్పుడైనా నిమగ్నమవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), పేజి. 1208.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషింగ్, 2005), పేజి. 1199.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., పేజి.. 1209.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., పేజి.. 1208.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., పేజి.. 1208.
ప్రశ్నలు
-
యేసు 40 రోజులు అరణ్యానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన సాతాను చేత ఎందుకు శోధించబడ్డాడు? ఇది అవసరమని మీరు అనుకుంటున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు?
దినవాక్యం
Laura Martin Mark 1:38
“And He said to them, ‘Let’s go on to the neighboring villages so that I may preach there too. This is why I have come.’”
యేసుకు తన లక్ష్యం తెలుసు: దేవుని సువార్తను ప్రకటించడం, అంటే సత్యం నెరవేరింది, దేవుని రాజ్యం సమీపించింది, మరియు అందరూ పశ్చాత్తాపపడి సువార్తను విశ్వసించాలి. ఆయన పూర్తి అధికారంతో బోధించడానికి వెళ్ళాడు. బోధించడం, స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం వంటి వాటి మధ్య ఒక సమయంలో, ఆయన ప్రార్థన చేయడానికి ఉదయాన్నే ఒంటరిగా వెళ్ళాడు. అతని శిష్యులు వెంటనే ఆయనను కనుగొని, "అందరూ నీ కోసం వెతుకుతున్నారు!" దానికి యేసు, “వెళ్దాం. అందుకే వచ్చాను!"
మానవ రూపంలో ఉన్న యేసు దేవుడు. అతను పూర్తిగా మానవుడని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆయనకు తన పరిచర్య మరియు పిలుపు తెలుసు, మరియు ఆయన ఇదే పరిచర్యను అప్పగించాడు మరియు మీ జీవితానికి పిలుపునిచ్చాడు. యేసువలెనే, మీకు విరాముము లేని సమయములు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ కోసం వెతుకుతున్నప్పుడు మీరు డిమాండ్ చేసే సమయాలను కలిగి ఉంటారు. కాబట్టి, ప్రార్థన చేయడానికి అన్ని కార్యకలాపాల నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను యేసు నమూనా చేస్తాడు. అతను "పదండి వెళ్ధాం!" అనే సానుకూలతను కూడా మాదిరిగా చేస్తాడు. సమయం వచ్చినప్పుడు మీ వైఖరిని తిరిగి పరిచర్య మీదకు వెళ్లండి. ఈరోజు, ప్రార్థించడానికి మరియు ప్రభువును వెదకడానికి సమయాన్ని వెచ్చించండి. మరియు పనికి తిరిగి వచ్చే సమయం వచ్చినప్పుడు, “వెళ్దాం! దీనికే దేవుడు నన్ను పిలిచాడు.” మీ స్వంత శక్తితో కాకుండా పరిశుద్ధాత్మ యొక్క బలం మరియు శక్తితో పని చేయండి, మీ పరిచర్యలో ప్రతి అడుగుకు మిమ్మల్నిమీరు సిద్ధం చేసుకొనండి.
“ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.”
- మార్కు 1:38
తదుపరి లేఖన భాగములు
ఫిలిప్పీయులు 2:13 — “ఎందుకనగా మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే."
కొలొస్సయులు 1:28-29 — “ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.”
2 తిమోతి 1:9 — “మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.