The Gospels Luke

The Coming of the Son of Man

యేసును ఇలా కనుగొనండి: Son of Man Luke 21 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 175వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

లూకా సువార్తలోని సంఘటనలు నిర్మించబడి ముగింపుకు చేరుకుంటున్నాయి. లూకా 21:1-4 విధవరాలి కానుక గురించి మాట్లాడింది, ఆమె ఆలయ ఖజానాకు ఇచ్చిన రెండు చిన్న నాణేలు. అప్పుడు యేసు లూకా 21:5-6లో ఆలయ విధ్వంసాన్ని, లూకా 21:7-19లో అంత్యకాల సూచనలను మరియు లూకా 21:20-24లో యెరూషలేము నాశనాన్ని ఊహించాడు. కానీ ఈ పాఠంలో, నేను అధ్యాయంలోని మిగిలిన వచనాలను విప్పాలనుకుంటున్నాను.

పాఠము

లూకా 21:25: యేసు తన పునరాగమనం సమీపిస్తున్నదని సూచించే సంఘటనలను వివరించాడు. దేవుడు భూమిపైకి పంపబోయే తీర్పు "యాకోబు కష్టాలు" అని పిలువబడే చివరి సగంలో జరుగుతుంది.1 యిర్మీయా 30:7 ఇలా చెబుతోంది, "అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.” "గర్జించే సముద్రాలు మరియు అలలు" అనే పదాలు ఇతర వచనాలలో కనిపిస్తాయి. కీర్తన 46:1-6 ఇలా చెబుతోంది, “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు … భూమి మార్పునొందినను … వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు … దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు. జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి,” అయితే దేవుడు ప్రపంచమంతటా ఉన్న గందరగోళం మధ్య తనను తాను స్థాపించుకుంటాడు. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రాలు మరియు అలల వల్ల దేశాలు అయోమయంలో పడతాయని మనం ఆశించాలి.

లూకా 21:26: “ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” మత్తయి తన సువార్తలో (మత్తయి 24:29) ఇదే విధమైన ప్రకటనను నమోదు చేశాడు.

ప్రకటన 15-19 ఏడు సంవత్సరాల శ్రమల రెండవ భాగంలో దేవుడు భూమిపై పంపబోయే తీర్పును వివరిస్తుంది. మొదటి మూడున్నరేళ్లలో ప్రపంచం శాంతిని చూస్తుంది. ఏడు సంవత్సరాల ఒప్పందం (దానియేలు 9) రెండవ సగంలో, క్రీస్తు విరోధి ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఆలయంలో తన ప్రతిమను ఏర్పాటు చేయడానికి యెరూషలేముకు వెళ్తాడు. ఇది జరిగినప్పుడు, మనము ఇప్పుడే వివరించిన అన్ని విషయాలు జరగడం ప్రారంభమవుతాయి. దేవుడు తన కోపాన్ని పంపడం ప్రారంభిస్తాడు. విశ్వాసులు ఈ కష్టాల సమయంలో భాగమవుతారా? శ్రమలకాలమునకు ముందే సంఘము ఎత్తబడుతుందనే వారి దృష్టిలో, ఇది జరిగినప్పుడు విశ్వాసులు భూమిపై ఉండరు. శ్రమలకాలము మధ్యలో సంఘము ఎత్తబడుతుందనే వారి దృష్టిలో, విశ్వాసులు ఈ సమయం మధ్య వరకు ఇక్కడ ఉంటారు; మనము శాంతి సంవత్సరాలలో ఇక్కడ ఉంటాము కానీ ఉగ్రత రాకముందే తీసివేయబడతాము. శ్రమలకాలము తరువాత సంఘము ఎత్తబడుతుందనే వారి దృష్టిలో, ఈ శ్రమలకాల సమయంలో విశ్వాసులు మొత్తం ఏడు సంవత్సరాలు భూమిపై ఉంటారు. మీరు వీటిలో దేనిని తీసుకున్నా, మనుష్యకుమారుని రావడానికి సిద్ధంగా ఉండటం మంచిది. విశ్వాసులు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం దీని ద్వారా వెళ్ళవలసి ఉంది.

లూకా 21:27: " అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. " దీన్ని మత్తయి 24:30తో పోల్చండి, “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును.” మనుష్యకుమారుని సూచన మొదట కనిపిస్తుందని లూకా చేర్చలేదు. మనుష్యకుమారుని యొక్క సూచన ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ అది కనిపించిన వెంటనే, మనుష్యకుమారుడు మేఘాల మీద రావడం అందరూ చూస్తారు. ఏదో ఒక విషయం భూమిపై ఉన్న ప్రజలందరి దృష్టిని ఆకర్షించి, దుఃఖించేలా చేస్తుంది. దానియేలు 7:13-14 ప్రకారం, ఆ సూచన భయాన్ని కలిగిస్తుంది, “రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చెను” మనుష్యకుమారుడు వస్తాడని దానియేలు ప్రవచించాడు. ప్రకటన 1:7 ఇలా చెబుతోంది, “ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును. మీరు రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, మొజాంబిక్‌లో ఉన్నా, ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. బహుశా ఇది మీడియా ద్వారా సాధించబడుతుంది. ఇది ఎలా జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి మాకు మార్గం లేదు.

లూకా 21:28: " మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను!" కీర్తన 24:7 ఇలా చెబుతోంది, “గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.” ధనవంతుడు మరియు లాజరులో అదే మనస్తత్వం ప్రదర్శించబడింది. ధనవంతుడు తల దించుకున్నాడు, భౌతిక మరియు తాత్కాలిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాడు. కానీ మీ తల పైకి ఉన్నప్పుడు, మీరు ప్రతిదానిలో ప్రభువు కోసం వెతుకుతున్నారు. కీర్తన 111:9 ఇలా చెబుతోంది, “ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు … ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.." యెషయా 63:4 ఇలా చెబుతోంది, “పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను.” మనము శ్రమలకాలమును మరియు విమోచనను ఆశించవచ్చు.

లూకా 21:29-33: యేసు ఒక ఉపమానం చెప్పడం ద్వారా వీటన్నిటినీ ఒకచోట చేర్చాడు. 29-30 వచనాలలో, వేసవికాలం సమీపిస్తోందని సూచించడానికి యేసు చిగిరించుటచూచి  చెట్టు యొక్క ఉదాహరణను ఉపయోగించాడు. మత్తయి 24:36లో, మనుష్యకుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదని యేసు చెప్పాడు. యేసు మనుష్యకుమారునిగా భూమిపై ఉన్నప్పుడు ఆయనకు కూడా తెలియదు. మార్కు 11 అదే విషయం చెప్పాడు. ఇది వాస్తవానికి 30వ వచనం ఆధారంగా వేసవికాలం సమీపంలో జరగవచ్చు.

31వ వచనంలో, వారు “ఈ సంగతులు” చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపంలో ఉంటుందని యేసు చెప్పాడు. ఏ సంగతులు? మనుష్యకుమారుడు మేఘాల మీదికి వస్తున్నాడన్న సూచనలు, ఆకాశమందలి శక్తులు దిలింపబడతాయి, ప్రజలు భయపడి, రాబోయే వాటి గురించి నిరీక్షిస్తూ మూర్ఛపోతారు, దేశాల మధ్య భూమిపై వేదన. యేసు స్పష్టంగా చెప్పాడు: ఇప్పుడు దేవుని రాజ్యం ఉంటుంది మరియు భవిష్యత్తులో దేవుని రాజ్యం ఉంటుంది. యేసు దేవుని రాజ్యాన్ని అమలు చేయడానికి తిరిగి వచ్చినప్పుడు ఉండే దేవుని భవిష్యత్తు రాజ్యం గురించి ఇది మాట్లాడుతోంది,. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం విశ్వ సూచనలను మరియు భూసంబంధమైన కలవరమును చూసినప్పుడు మనం ఆత్మీయ మార్పును చూస్తాము.2 యెషయా 27:12-13 ఇలా చెబుతోంది, “ఆ దినమున … ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు... యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.” మనము ఇశ్రాయేలు దేశం మధ్య ఉజ్జీవము చూస్తాము. మత్తయి 24:31 ఇలా చెబుతోంది, " మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు." ఆయన ఎన్నుకున్న ప్రజల సమూహాన్ని మనం చూడటం ప్రారంభిస్తాము. మత్తయి 24:34 ఇలా చెబుతోంది, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” ఒక తరం ఇలా జరగడాన్ని చూస్తుంది. మనం ఆ తరం అయితే? ఈ ఏడు సంవత్సరాల పిచ్చి గందరగోళం, శాంతి, కలవరము, మార్పు, క్రీస్తు విరోధి కనిపించడం మరియు మనుష్యకుమారుడు తిరిగి రావడం వంటివి మనం అనుభవిస్తే? ఈ హాస్యాస్పదమైన ప్రయాణంలో మనం కూడా భాగమైతే? మనం మన ఇష్టం వచ్చినట్లు జీవించాలి. మన హృదయ స్పందన ఇలా ఉండాలి, “ప్రభువైన యేసూ, రమ్ము,!”

లూకా 21:33: "ఆకాశము మరియు భూమి గతించును." విశ్వం అక్షరాలా నశించిపోతుంది అప్పుడు మనం కొత్త ఇశ్రాయేలు, కొత్త నిర్మాణం, కొత్త భూమి మరియు కొత్త పరలోకమును చూస్తాము. "కానీ నా మాటలు ఎన్నటికీ గతింతిపోవు." యెషయా 40:8లో “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.” అని యేసు ధృవీకరించాడు. లూకా 16:17 ఇలా చెబుతోంది, “ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.” పాత నిబంధనలోని ప్రతిదీ కొత్త నిబంధనలో, కొత్త ఒడంబడికలో ఫలవంతమవ్వాలి మరియు నెరవేర్పుకు రావాలి. దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఆయన మొదట్లో చెప్పినదానికి కట్టుబడి ఉంటుంది. బైబిల్‌లోని 66 పుస్తకాలలో ప్రతి ఒక్కటి మెస్సీయను సూచిస్తున్నాయి. యేసు నాశనము చేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల చెప్పినవాటిని నెరవేర్చడానికి వచ్చాడు (మత్తయి 5:17).

లేఖనాల్లో వివరించబడిన అన్నింటిని బట్టి, మనుష్యకుమారుడు మేఘాలపై తిరిగి రావడాన్ని మనం చూడటంలో భాగం అయితే? మెస్సీయ రాకడను మనం చూసినట్లయితే? వైర్స్‌బే చెప్పినట్లుగా మనం చూడగలిగితే, “దేశాలు ఇశ్రాయేలులోని మెగిద్దో లోయలో సమావేశమై యెరూషలేములో క్రీస్తు విరోధితో పోరాడుతాయి, ఆపై క్రీస్తు సూచనను చూడండి, ఆపై మనుష్యకుమారుడు భూమికి తిరిగి వస్తాడు, ఆయన శత్రువులను ఓడించి, యూదులచే స్వీకరించబడి, ఇక్కడ భూమిపై దేవుని రాజ్యం స్థాపింస్తాడని చూడండి”?3 1000 సంవత్సరాల భూమిపై ఈ పాలన ప్రారంభమవడాన్ని మనం చూస్తే?

లూకా 21:34-38లో చర్చి జీవించియుండేలా చూడడానికి మనం సిద్ధంగా ఉన్నామా, “ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. . . కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.” సంఘముగా, మనము మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు మనము ఇప్పుడు ప్రార్థించాలి. అలాగే, 1 యోహాను 2:28 ఇలా చెబుతోంది, “కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.” మనమందరం తీసుకున్న సవాలు ఇదేనా అని ఆలోచించండి. ఇది జరగబోయే వాస్తవం. ఆయన తిరిగి రావడానికి ప్రజలను సిద్ధం చేయడమే మన పిలుపు. అంత్యకాలములో నిలబెట్టే శక్తి కొరకు ప్రార్థించడం మొదటి అడుగు అయితే?

ముగింపు

మనుష్యకుమారుని పునరాగమనానికి సిద్ధపడేందుకు యేసు అనేక సూచనలను ఇచ్చాడు. మన విమోచన సమీపంగా ఉన్నందున ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవాలి (లూకా 21:28). ఈ విషయాలు జరుగుతున్నప్పుడు, దేవుని రాజ్యం సమీపంలో ఉందని మనం గుర్తించాలి (లూకా 21:31). మనం జాగ్రత్తగా ఉండాలి (లూకా 21:34), కాబట్టి మనం ధనవంతుల మార్గాలకు, భూసంబంధమైన విషయాలకు తిరిగి వెళ్ళకూడదు. మన మనస్సును శాశ్వతమైన వాటిపైనే ఉంచాలి. మనం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి (లూకా 21:36). అప్రమత్తంగా ఉండేందుకు గల మార్గాలలో ఒకటి శక్తి కొరకు ప్రార్థించడం.4 క్రీస్తు శరీరంగా మనం మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. అలా చేయడానికి, మనం విశ్వాసం కోసం ప్రార్థించాలి. మనుష్యకుమారుని పునరాగమనానికి మనం సిద్ధంగా ఉండాలి.

  1. వారెన్ W. వైర్స్బే, ది వైర్స్బే బైబిల్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి కుక్, 2007), p. 211.

  2. ఎర్ల్ రాడ్‌మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), p. 1296.

  3. వైర్స్బే, n.p.

  4. వైర్స్బే, పేజి. 211–212.

ప్రశ్నలు

  1. యేసు అనుచరులకు ఇలా చెప్పబడింది, " ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును." (లూకా 21:12-13). ఇది ఏ అవకాశానికి దారితీస్తుందని యేసు చెప్పాడు? మీరు ఎప్పుడైనా కష్టాలను రాజ్యావకాశాల కోణంలో చూశారా? అలా అయితే, కథను ఎవరితోనైనా పంచుకోండి.

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Luke 21:34

“Be on your guard, so that your minds are not dulled from carousing, drunkenness, and worries of life, or that day will come on you unexpectedly like a trap.”

యేసు మెస్సీయగా తిరిగి వస్తున్నాడు. కాబట్టి, యేసు తన శిష్యులకు సిద్ధంగా ఉండమని, మెలకువగా ఉండమని, సూచకక్రియల కొరకు వెతకమని, ఆశ్చర్యపోవద్దని పదే పదే చెప్పాడు! మద్యపాన మత్తుతో మరియు జీవిత చింతల నుండి మొద్దుబారిపోకుండా వారి మనస్సు సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. వారి మనస్సు మొద్దుబారినట్లయితే, ఆ రోజే వారిని రక్షించేవారుండరు.

మీ మనస్సు మద్యపుమత్తుల నుండి మరియు జీవిత చింతల నుండి మందగించకుండా జాగ్రత్త వహించమని యేసు ఎలా చెప్పాడో గమనించండి. అయితే ఎలా మీరు జాగ్రత్తగా ఉండాలి? ప్రార్థన ద్వారా, కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనపట్లనున్న నిరీక్షణపై మీ మనస్సును నిలపమని యేసు చెప్పాడు. స్థిరంగా నిలబడటానికి ప్రార్థన మీకు బలాన్ని ఇస్తుంది మరియు సువార్త గురించి సిగ్గుపడనివ్వదు. మీరు జీవితంలోని చింతలను స్వీకరించినప్పుడు, చింతించటానికి లేదా తాత్కాలిక ఆనందాలను వెతకడానికి వచ్చే శోధనలనును నిరోధించండి. బదులుగా, యేసులోకి ప్రవేశించి స్థిరంగా ఉండండి. అలా చేస్తే, మీరు క్రీస్తు తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటారు.

“మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.”

— లూకా 21:34

తదుపరి లేఖన భాగములు

  • లూకా 21:36 — “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.”
  • కొలస్సీయులకు 4:2 — “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.”
  • 1 పేతురు 1:13 — “కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.”