The Pentateuch Leviticus

The Burnt Offering

యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 1-3 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 52వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

పరిశుద్దగ్రంధం ద్వారా ప్రతి పుస్తకంలో మెస్సీయను సూచించే ఒక పదాన్ని గుర్తించడమే మన లక్ష్యం. ఆదికాండములో సంతానము అనే పదము (ఆదికాండము 3:15). నిర్గమకాండమునకు మన పదము విమోచకుడు (యూదా 5). ఇప్పుడు మనం లేవీయకాండములో ఉన్నాము. లేవియకాండము అంటే, "ఆయన పిలిచాడు" లేదా "ఆయన పేరు పెట్టాడు."

లేవీయకాండ గ్రంధములో యేసు కొరకు మన పదము ప్రాయశ్చిత్తము. పాత ఒడంబడిక మొత్తం యేసు మరియు మెస్సీయను సూచిస్తుంది. లేవియకాండము లేవీయులకు సంబంధించినది – యాజకులు, మరియు మెస్సయ ఒడంబడిక యొక్క అవసరాలను కలిగి ఉంది. గోర్డాన్ వెన్‌హామ్ ఇలా వ్రాశాడు, “అయితే, లేవియకాండమును యాజకుల పుస్తకముగా వర్ణించడం తప్పు. ఆరాధనలో సామాన్య విశ్వాసులు పోషించాల్సిన భాగానికి ఇది సమానంగా సంబంధించినది.”1 ఇది రోజువారీ వ్యక్తుల కోసం.

ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కలిగి ఉన్నారు, మరియు దేవుడు వారికి మరిన్ని నిబంధనలను ఇస్తానని చెప్పాడు: పరిశుద్ధ స్థలమునకు ఎప్పుడు వెళ్లాలి? ఏం తీసుకురావాలి? యాజకులు ఏమి చేయాలి? వారు ఎలా దుస్తులు ధరించాలి? పుస్తకంలోని కొన్ని అధ్యాయాలు మాత్రమే నేరుగా లేవీయులకు ఇవ్వబడ్డాయి. మిగతా సూచనలు దేవుని సన్నిధిని ఎలా చేరుకోవాలో రోజువారీ వ్యక్తులకు కోసం సూచించబడ్డాయి. మార్క్ F. రూకర్ ఇలా వ్రాశాడు, "వారు యూదుల పిల్లలకు బోధించే పుస్తకాలలో ఇది ఒకటి.”2

లేవియకాండము యొక్క ప్రధాన ఇతివృత్తాలలో ఒకటి పరిశుద్ధత అని సైల్‌హామర్ చెప్పారు.3 దేవుడు ఇశ్రాయేలీయులను ఇలా గుర్తించాడు: (1) ఒక స్వకీయ సంపాద్యమును, (2) యాజక రూపమైన రాజ్యముగాను మరియు (3) పరిశుద్ద జనముగా గుర్తించాడు (నిర్గమకాండము 19:5-6). లేవీయకాండములో, ఇది ఎలా జరుగుతుందనే దాని గురించి దేవుడు వారికి ఒక గ్రంథమును ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు, మరియు ప్రత్యక్ష గుడారములో ఎలా వ్యవహరించాలో వారికి తెలియదు. వారికి బోధన అవసరం.

పాఠము

లేవీయకాండము 1:1-2: మోషే యొక్క ప్రేక్షకులు ఇశ్రాయేలీయులు. “అర్పించడం” అంటే “దేవుని దగ్గరికి తీసుకురావడం” అని నెల్సన్ రాశాడు.4 ఇశ్రాయేలీయులకు దేవుణ్ణి ఎలా సంప్రదించాలో తెలియదని గుర్తుంచుకోండి. సింహాసనాన్ని ఎలా చేరుకోవాలో దేవుడు వారికి బోధిస్తున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరికీ వారి మందలు ఉన్నాయి.

లేవీయకాండము 1:3: నోవహు బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు (ఆదికాండము 8:20). అబ్రాహాము తన స్వంత కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించవలసియున్నది (ఆదికాండము 22:1). మోషే మామ అయిన యిత్రో దేవునికి దహనబలిని తెచ్చాడు (నిర్గమకాండము 18:11-12). ఆ స్థలములో ప్రత్యక్ష గుడారం లేకపోయినా, దహనబలి అనే ఆలోచన వారికి క్రొత్తదేమీ కాదు. మందలో నుండి మచ్చలేని మగది అవసరమైయున్నది. వారు ఆమోదయోగ్యమైన నైవేద్యాన్ని తీసుకురావాలి. కాలక్రమేణా, ఇది ప్రయాసముగా మారుతుంది. చివరికి వారికి 613 నియమాలు మరియు నిబంధనలు ఇవ్వబడతాయి.

లేవీయకాండము 1:3-9: దహనబలుల ప్రక్రియ:

  1. నైవేద్యము (అర్పణను) సమర్పించండి (v.3).
  2. జంతువుల తలపై చేతులు ఉంచాలి (v.4).
  3. బలిని వధించాలి (వ. 5). యాజకుని పర్యవేక్షణలో చంపుట లేదా బలి జరుగుతుంది యాజకుడు బలి ప్రక్రియను చేయడు.
  4. రక్తాన్ని సేకరించి బలిపీఠం మీద ప్రోక్షింపవలెను (v. 5b). యాజకులు ఇలా చేశారు. ఇది అంతా రక్తం గురించి, ఎందుకంటే రక్తం లేకుండా ప్రాయశ్చిత్తం లేదు.
  5. నైవేద్యము లేదా దహనబలిని చర్మమును వలిచి ముక్కలుగా కోయడం (వ. 6). దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలంటే నైవేద్యమున్న వాడు ఆ పని చేయవలసి ఉంటుంది.
  6. యాజకులు అగ్నిని సిద్ధం చేశారు (v.7).
  7. అప్పుడు వారు బలి అవయవములను అగ్నిపై అమర్చారు (వ.8).
  8. నైవేద్యమును లేదా దాని లోపలి భాగాలను నీటితో కడుగుతారు (v. 9a). ప్రజలకు దిశానిర్దేశం మరియు ఏక దృష్టి అవసరం.
  9. యాజకులు దానినంతయు దహింపవలెను (వ. 9 బి). అగ్ని ద్వారా శుద్ధి జరిగింది. ఇశ్రాయేలీయులు ఆయన సన్నిధిలో దేవునిని సమీపించుటకు చేయవలసినది ఇదే.

లేవీయకాండము 1:10: ఎద్దును (పైన చూడండి) సమర్పించడానికి ఉపయోగించే ఖచ్చితమైన ప్రక్రియనే గొర్రెలు లేదా మేకలను సమర్పించడానికి ఉపయోగించబడింది. ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పోరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను అధికమని ఆయనతో చెప్పెను (మార్కు 12:33). కానీ ఈ భాగాలన్నీ క్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రాయశ్చిత్తాన్ని సూచించాయి.

లేవీయకాండము మొత్తమునకు ఒకే ఒక పదము ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అనే పదం గురించి నేను మీకు శీఘ్ర నేపథ్యాన్ని అందించాలనుకుంటున్నాను:

ఇశ్రాయేలీయులు (జంతువు) తలపై చేయి ఉంచినప్పుడు, "అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి" (లేవీయకాండము 1:4) అతను అంగీకరించబడును.

ప్రాయశ్చిత్తం అంటే “కప్పడం.”

కానిస్టేబుల్ "ప్రాయశ్చిత్తం"5 యొక్క మూడు అర్థాలను వివరించాడు:

ప్రత్యామ్నాయం – అర్పించబడే వ్యక్తి స్థానంలో జంతువు బలిగా అర్పించబడింది. పరిపూర్ణ జంతువు యొక్క రక్తం అర్పించేవారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది.

ఆరోపణ - దేవుడు ఇశ్రాయేలీయుల అపరాధాన్ని బదిలీ చేసి జంతువుపై ఉంచాడు (అర్పించే వ్యక్తి జంతువు తలపై తన చేతులు ఉంచినప్పుడు).

మరణం - ప్రాయశ్చిత్తం జరాగడానికి ఇది అవసరం. రక్తప్రోక్షణ ప్రాయశ్చిత్తం తెచ్చింది.

వారు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఈ మొత్తం ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.

లేవీయకాండము 2: భోజనం/ధాన్యం సమర్పణ.

లేవీయకాండము 3: సహవాసము/శాంతి నైవేద్యము.

ముగింపు

లేవియకాండమంతా మన ప్రాయశ్చిత్తమైన క్రీస్తును సూచిస్తుంది.

  1. గోర్డాన్ జే. వెన్‌హామ్, ది బుక్ ఆఫ్ లెవిటికస్ (గ్రాండ్ రాపిడ్స్, MI: Wm. బి. ఎర్డ్‌మాన్స్, 1979), పే. 3.

  2. డాక్యుమెంటరీ హైపోథెసిస్ చర్చ మరియు విమర్శను చూడండ, మార్క్ F. రూకర్, లెవిటికస్, pp. 23–38లో.

  3. జాన్ హెచ్. సైల్‌హామర్, ది పెంటాట్యూచ్ యాజ్ నేరేటివ్ (గ్రాండ్ రాపిడ్స్, MI: జోండర్‌వాన్), పే. 323

  4. ఎర్ల్ డి. రాడ్‌మాచర్, రోనాల్డ్ బి. అలెన్, మరియు హెచ్. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే, TN: థామస్ నెల్సన్), p.153.

  5. థామస్ యల్. కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్స్ ఎక్స్‌పోజిటరీ (బైబిల్ స్టడీ) నోట్స్; ఆన్‌లైన్‌లో https://planobiblechapel.org/tcon/notes/pdf/leviticus.pdf, p. 13.

ప్రశ్నలు

  1. పురుషులు దహనబలిని తెచ్చి, జంతువు తలపై చేతులు ఉంచాలి, తద్వారా వారి అపరాధాన్ని జంతువుపైకి మార్చాలి. లేవీయకాండము 1:4 ప్రకారం, దీని ఉద్దేశ్యం ఏమిటి? యెషయా 53:12బిలో ఈ వాస్తవికతను మీరు చూడగలరా?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Leviticus 1:1-2, 3b

“Then the LORD summoned Moses and spoke to him from the tent of meeting: ‘Speak to the Israelites and tell them: When any of you brings an offering to the LORD from the livestock, you may bring your offering from the herd or the flock....He must bring it to the entrance to the tent of meeting so that he may be accepted by the LORD.’”

నిర్గమకాండము అనేది ప్రత్యక్ష గుడారానికి రూపకల్పన గ్రంధము లాంటిది, అయితే లేవియకాండము దానిని ఎలా వినియోగించుకోవాలో తెలియజేసే పుస్తకము. ఇది ధర్మశాస్త్రమునకు సంబంధించిన నీతి పుస్తకము. ఇది దహనబలులు, ధాన్యార్పణలు మరియు సమాధాన లేదా సహవాస అర్పణలను వివరించడం ద్వారా ప్రారంభమవుతుంది. ప్రజలు తమ అత్యంత ఖరీదైన ఆస్తులను లేదా జీవనోపాధిని యెహోవాకు అర్పణగా బలిపీఠం వద్ద అర్పించారు. బలులు దేవునికి ఓదార్పునిచ్చే సువాసన మరియు ప్రజలు ఆయనచే ఆమోదయోగ్యమైనవిగా కనుగొనబడటానికి అనుమతించారు. బలిపీఠం వద్ద బలి అర్పించడానికి ఇది మాత్రమే సరిపోతుంది.

క్రీస్తును వెంబడించడానికి సమస్తమును విడిచిపెట్టిన శిష్యులు కూడా ఈ అర్పణలు అర్పిస్తారు. అది కూడా దేవునికి ప్రీతికరమైనదే. మీరు దేవున్ని ఆరాధిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు సజీవయాగముగా సమర్పించుకోవాడానికి పిలువబడ్డారు. మీరు దేనినీ వెనక్కి తీసుకోవద్దు. ఈ రోజు మీరు దేవునికి సజీవయాగాముగా సమర్పించాల్సిన ఆరాధన ఏదైనా ఉందా? మీరు దానిని ఆయన ముందు ఉంచినప్పుడు, అది ప్రభువును సంతోషపెడుతుందని జ్ఞాపకము చేసుకొనుడి.

“యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండి గాని గొఱ్ఱెల మందలో నుండి గాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను....తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.”

  • లేవియకాండము 1-1-2, 3b

తదుపరి లేఖన భాగములు

మార్కు 8:34- “ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచినన్ను వెంబడింప గోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబ డింపవలెను.”

యోహాను 12:3- “అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.”

రోమా 12:1- “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.”