God Blesses Joseph In Everything He Did
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 39-40 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
మనము లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, మెస్సీయ యొక్క పూర్తి చిత్రాన్ని చిత్రించడమే మన లక్ష్యం. ఆదికాండము కొరకు మన పదము ‘సంతానము’. ఆదికాండము 3:15 ఇలా చెబుతోంది, “మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.”, క్రీస్తు అనబడిన సంతానము, ఆదికాండము గ్రంధములో వ్యాపించి ఉన్నాడు. మనము అధ్యయనం చేసాము: అబ్రాహాము మరియు శారా; ఇస్సాకు మరియు రిబ్కా; యాకోబు మరియు లేయా; యూదా మరియు తామారు; మరియు పెరెసు.
యోసేపు గోతిలో పడవేయబడినప్పటి నుండి అతను మరియు అతని సహోదరులు ఐగుప్తులో తిరిగి కలుసుకున్నప్పటికి మధ్య 22 సంవత్సరాల నిడివి ఉన్నది. ఇప్పుడు మనం తిరిగి వెళ్లి, గోతిలో పడవేయబడి ఐగుప్తుకు తీసుకెళ్లబడిన యోసేపు వైపు చూద్దాము.
పాఠము
ఆదికాండము 39:1: ఐగుప్తులో పోతీఫరు యోసేపును 20 వెండి నాణెములకు కొన్నాడు. వారెన్ వైర్స్బే ఇలా వ్రాశాడు, "జోసెఫ్ తనను తాను కనుగొన్న ఐగుప్తు ప్రధానంగా భూమిలో పని చేసే మరియు ధాన్యం మరియు కూరగాయలను పండించే రైతులు నివసించే చిన్న గ్రామాల గల భూమి." 1 ఐగుప్తు నైలు నదిపై ఉంది. ఈ సమయంలో దాని చుట్టూ ఉన్న రెండు ప్రధాన నగరాలు ఆను మరియు మెంఫిస్ మాత్రమే. ఐగుప్తు చాలా మతపరమైన మూఢనమ్మకాలను ఆచరించింది మరియు కనీసం 2,000 దేవుళ్లను ఆరాధించింది. సమాజము గొప్ప నిర్మాణకులతో రూపొందించబడింది. వారు వాస్తవానికి 365-రోజుల క్యాలెండర్‌ను అభివృద్ధి చేశారు! ఇగుప్తీయులు స్థాపించబడిన ఔషధాలను మరియు విజయవంతమైన శరీరానికి వ్రాసుకొనే ఆయింట్మెంట్ల పద్ధతులను సృష్టించారు. ఈ కాలంలో, ప్రధనముగా బానిసత్వం ఎక్కువగా ఉండేది.2
ఆదికాండము 39:2: యోసేపు దారితప్పిపోలేదు! అతను గోతిలో విసిరివేయబడలేదు మరియు దాని గురించి మరచిపోలేదు. ప్రభువు అతనితో ఉన్నాడు! యోసేపు విజయవంతంగా సేవ చేశాడు. అతను పొలాల్లో సేవ చేయడం లేదు; దేవుడు అతనిని ప్రముఖులకు సేవ చేసేలా ఉంచాడు. 39వ అధ్యాయంలో కొనసాగుతున్న ఇతివృత్తం ఏమిటంటే, ప్రభువు యోసేపుతో ఉన్నాడు అని నాలుగు వేర్వేరు సార్లు చెప్పబడింది (ఆది 39:2-3, 21, 23). మీరు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులను చూసినప్పుడు, ప్రభువు హస్తం వారిపై ఉందని మీకు తెలుసు ఇప్పుడు అది యోసేపు విషయంలో నిజమైంది!
యూదా సంతానాన్ని మోసుకెళ్లినప్పటికీ, యోసేపు తప్పనిసరి. 11 మంది సహోదరులు పెద్ద కష్టాల్లో ఉన్నారు, వారిని రక్షించడానికి దేవుడు యోసేపును ఉపయోగించాడు. యోసేపు ఆదికాండము 12:3 యొక్క పాక్షిక నెరవేర్పు, అది “భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడతారు” అని పేర్కొంది. జోసెఫ్ గొయ్యి నుండి జైలుకు రాజభవనానికి వెళ్ళాడు-అన్నీ వాగ్దానం కారణంగా.
ఆదికాండము 39:3-4: యోసేపు చేసినదంతా ప్రభువు వర్ధిల్లేలా చేసాడు. యోసేపు మరియు పోతీఫరు కలిసి ప్రతిదీ చేసారు. ఇది మోషేకు యెహోషువా లేదా ఏలీయాకు ఎలీషా ఎలా ఉన్నారో అలా. వారు చాలా పరస్పర సంభాషణ కలిగి ఉన్నారు. యిర్మీయా 29:7లోని ప్రవక్త మాటలలో యోసేపు జీవించాడు: “నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడు తనను ఉంచిన నగరం యొక్క క్షేమాన్ని యోసేపు కోరాడు. మనము ఎక్కువగా బాధితులతో ఆడుతామని నేను అనుకుంటున్నాను: " అయ్యో నాకు శ్రమ!" అనే దానితో మనం వ్యవహరించాలి, దాని కోసం ప్రార్థించాలి మరియు దేవుడు దానిని గౌరవిస్తాడు.
ఆదికాండము 39:5: యోసేపు కారణంగా ప్రభువు పోతీఫరును మరియు అతని ఇంటివారిని ఆశీర్వదించాడు (ఆదికాండము 12:1-3)! పవిత్రమైన హృదయాన్ని యోసేపు కలిగియున్నాడు గనుక పోతీఫరు అతనిని నమ్మాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను(వ. 6). సామెతలు 22:29 ఇలా చెబుతోంది, “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును. ” యోసేపు తనకు ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించాడు (మత్తయి 25:21). యేసు యోసేపు గురించి మాట్లాడుచున్నట్లయితే అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నాను.
మన జీవితాల్లో సవాలు ఏమిటంటే: దేవుడు మనకు ఇచ్చిన దానితో మనం ఏమి చేస్తున్నాం? లూకా 16:10: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయ ముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.” యోసేపు చిన్న విషయాలలో నమ్మకస్తుడు కాబట్టే సంతానం అనబడిన క్రీస్తు భద్రపరచబడ్డాడు.
ఆదికాండము 39:7-9: కాసేపటి తర్వాత, పోతీఫరు భార్య యోసేపు వైపు తన కన్నులెత్తి కోరికతో అతని వైపు చూసింది. వాల్ట్కే ఇలా వ్రాశాడు, "సర్నా నాటకీయ వ్యంగ్యాన్ని కూడా సంగ్రహించింది: 'ఇంటి యజమానురాలైన
ఆమె, తన భర్త యొక్క బానిస కోసం ఆమె కామానికి బానిసగా ఉంది. యోసేపు పోతీఫరు పట్ల గౌరవాన్ని, శ్రద్ధను చూపించాడు. ఇది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమని యోసేపు గుర్తించాడు.
ఆదికాండము 39:10: ప్రతిరోజు పోతీఫరు భార్య అతని వద్దకు వచ్చినప్పటికీ, అతడు నిరాకరించాడు. వ్యాఖ్యాన రచయిత జాన్ హెచ్. సైల్హామర్ ఇలా వ్రాశాడు, “యోసేపు కథనాలు అబ్రాహాము, ఇస్సకు, యాకోబుల కథనాలకు సమతుల్యతను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. పితృస్వామ్య కథనాలు మరియు యోసేపు కథనం
మానవ వైఫల్యం ఉన్నప్పటికీ దేవుని విశ్వసనీయతను మరియు మానవుల పక్షాన విధేయతతో మరియు నమ్మకమైన ప్రతిస్పందన యొక్క ఆవశ్యకతను రెండింటినీ చూపుతాయి. ”4
మనము సర్ప సంతానానికి లొంగిపోలేము (యాకోబు 1:13-17; లూకా 22:40; మత్తయి 6:13; 1 కొరింథీయులు 10:13). యోసేపు శోధనకు వద్దు అని చెప్పగలిగితే, మనం కూడా అలా చెప్పగలం. దేవుడు ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని అందిస్తాడు! ఆదికాండము 4:6-7 ఇలా చెబుతోంది, “యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.’’
సాతాను మన వెనుక వస్తున్నాడు. పాపము తలుపు దగ్గర కూచుంది. పాప కోరిక మనకు ఉంది, కానీ మనం దానిని పాలించాలి. తామారు సంతానాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉన్నది. యోసేపు పాపం నుండి పారిపోవాలని పట్టుదలతో ఉన్నాడు (2 తిమోతి 2:22).
ఆదికాండము 39:11-12: పోతీఫరు భార్య అతనిని లాగింది, కానీ యోసేపు అతని వస్త్రాన్ని వదిలి పారిపోయాడు. వైర్స్బే ఇలా వ్రాశాడు, "ప్యూరిటన్ బోధకుడు చెప్పినట్లుగా, ' యోసేపు తన వస్త్రము పోగొట్టుకున్నాడు, కానీ అతను తన గుణాన్ని నిలబెట్టుకున్నాడు.'5 యోసేపు యొక్క వస్త్రం ఒక చిన్న దూడకు తొడిగే చొక్కాలా ఉంటుంది, నిజంగా అది అతని వెనుక చివర పొడవాటి టీ-షర్టును పోలి ఉంటుంది. మనం ఎవరితో తిరుగుతామో జాగ్రత్తగా ఉండాలి (సామెతలు 5:1-8).
ఆదికాండము 39:13-20: పోతీఫరు భార్య యోసేపు తన వస్త్రాన్ని రుజువుగా ఉపయోగించి తనతో నిద్రించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. సాతాను సమ్మోహనపరులను ఉపయోగించి ప్రతిదానిని గందరగోళానికి గురిచేస్తాడు. పోతీఫరు విన్నప్పుడు, అతను కోపంతో మరియు "కోపంతో ఊగిపోయాడు" (వ. 19). యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. అతను గోతి నుండి చెరసాలకు వెళ్ళాడు.
ఆదికాండము 39:21: దేవుడు యోసేపుకు చెరసాల కాపలాదారుని అనుగ్రహించాడు. కీర్తన 105:18 యోసేపు పరిస్థితిని ఇలా వర్ణిస్తోంది: “వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.” ఒక వ్యక్తిని దేవుడు గోతి నుండి చెరసాలకు తీసుకెళ్లి తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అనేది వెర్రితనం. దేవుడు యోసేపును బాధ నుండి తొలగించలేదు కానీ ఆ బాధ మధ్యలో అతనితో ఆయన ఉన్నాడు.
ఆదికాండము 39:22-23: ఖైదీలందరూ యోసేపు అధికారం క్రింద ఉంచబడ్డారు. దేవుడు యోసేపుతో ఉన్నాడు మరియు చెరసాలలో కూడా అతనికి అనుగ్రహం ఇచ్చాడు. యోసేపు పరిస్థితిని ముందుకు తీసుకువెళ్ళలేదు లేదా పరిస్థితికి ముందు పరుగెత్తలేదు, అది మంచిగా కనిపించనప్పటికీ, అతడు దానిని స్వీకరించాడు మరియు ఆశీర్వాదించబడుటకు అనుమతించాడు. సంతానం యొక్క వాగ్దానం కొనసాగుతుందని మాకు తెలుసు.
ఆదికాండము 40: పానదాయకుడును మరియు భక్ష్యకారుల అధిపతి కూడా చెరసాలలో వేయబడ్డారు. వారికి యోసేపు వివరించిన కలలు ఉన్నాయి. అమాయకుడు విడుదల చేయబడ్డాడు మరియు అతను విడుదలైనప్పుడు యోసేపును గుర్తుంచుకోవాలి, కానీ అతను మర్చిపోయాడు.
ప్రశ్నలు
-
ఆదికాండము 39:2, 3, 21 మరియు 23లో, ప్రభువు యోసేపుతో ఉన్నాడని మనము చూస్తాము. యోసేపు తన ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే దానిని నమ్మకపోవడం సులభం అని మీరు అనుకుంటున్నారా? [ఉదాహరణలు: అతని సహోదరుల ద్రోహం, అతన్ని బానిసత్వానికి అమ్మివేయుట, బంధువులు అతనిని కొని తిరిగి అమ్మడం, ఐగుప్తు యజమానిని క్రిందపనిచేయుట (హాగర్ గూర్చి ఆలోచించండి)].
దినవాక్యం
Laura Martin Genesis 39:21
“But the LORD was with Joseph and extended kindness to him. He granted him favor in the eyes of the prison warden.”
ప్రభువు యోసేపుతో ఉన్నాడు, మరియు అతను ఏమి చేసినా వర్ధిల్లింది. యోసేపు తన యజమాని పోతీఫరుతో అనుగ్రహాన్ని పొందాడు, అతను తన యాజమాన్యంలోని అన్నింటికి యోసేపును నియమించాడు. యోసేపుఅన్యాయంగా ఖైదు చేయబడినప్పుడు జైలు అధికారితో కూడా అనుగ్రహాన్ని పొందాడు. జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నా లేదా జీవితంలో తక్కువ స్థానంలో ఉన్నా, ప్రభువు యోసేపుతో ఉన్నాడు. యోసేపు తన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువులో స్థిరంగా ఉన్నాడు.
నీవు ఎక్కడ ఉన్నా నీతో ఉంటానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు మీ భావాలు మీ పరిస్థితులపై ఆధారపడకండి. ఆయన మీలో ఆనందిస్తాడు మరియు ఆయన మీ కోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడు.
“అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను..”
— ఆదికాండము 39:21
తదుపరిలేఖనభాగములు
- జెఫన్యా 3:17 — “నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును..”
- కీర్తనలు 139:7–10 — “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును.”
- యెషయా 26:3–4 — “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.