Jacob's Delay In Following God's Instructions
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 34-35 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము :
మనము పరిపూర్ణులము కానప్పటికీ, సంతానం అయిన క్రీస్తుకు మరింత సహాయం చేయడానికి దేవుడు మనల్ని ఉపయోగిస్తాడు. ఈ సమయంలో సంతానం యొక్క మార్గం: అబ్రహం ఇస్సాకు యాకోబు 12 మంది కుమారులు, 1 కుమార్తె.
పాఠము :
ఆదికాండము 34:2-30: యాకోబు కుమార్తె దీనా, షెకెమ్ చేత అత్యాచారం చేయబడింది, ఇది సహోదరులలో కొంత తీవ్రమైన కోపాన్ని కలిగించింది. వారి యొక్క ఆగ్రహం దీనా గురించి మాత్రమే కాదు, ఇశ్రాయేలు మీద కూడా! షెకెము దీనాను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కాబట్టి అతను తన గ్రామంలోని మగవారందరికీ సున్నతి చేయాలన షిమ్యోను మరియు లేవీలతో ఒప్పందం చేసుకున్నాడు. పురుషులు సున్నతి చేయబడ్డారు, మరియు వారి కోలుకున్న మూడవ రోజున, షిమ్యోను మరియు లేవీయులు గ్రామంలోకి ప్రవేశించి ప్రతి మగవారిని చంపారు. యాకోబు ఇతర కుమారులు ఆ నగరాన్ని దోచుకున్నారు. యాకోబు షిమ్యోను మరియు లేవీతో, "మీరు నన్ను బాధ పెట్టితిరి" (వ. 30). యాకోబు మళ్లీ సర్ప మనస్తత్వం యొక్క సంతానాన్ని కలిగి ఉన్నాడు మరియు తన కుమారులు చేసిన దాని కారణంగా తాను సంతానాన్ని కోల్పోతానేమోనని ఆందోళన చెందాడు.
ఆదికాండము 35:1: షెకెము నుండి వెళ్లి బేతేలులో స్థిరపడమని దేవుడు యాకోబుకు చెప్పాడు. ఇది ఆదికాండము 31:13లో దేవుడు యాకోబుకు ఇచ్చిన సూచనలను పునరావృతం చేసాడు, కానీ యాకోబు అంతవరకూ వెళ్ళలేదు. ఇది ఇరవై సంవత్సరాల క్రితం (ఆదికాండము 28), యాకోబు ఒక రాయిని ఏర్పాటు చేసి, బేతేలులో యెహోవాను తన దేవుడిగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు తాను చెప్పినట్లు చేయమని యాకోబుకు చెప్పాడు. యాకోబు ప్రభువు మాట విన్నప్పటికీ, అయన సూచనలను పూర్తి చేయలేదు. అతను ఏశావును ఎదుర్కొన్న తరువాత, యాకోబు షెకెముకు వచ్చి అక్కడ ఉన్నాడు (ఆదికాండము 33:18). ఇక్కడే దీనాపై అత్యాచారం జరిగింది. యాకోబు ఆలస్యం అతని కుటుంబాన్ని నాశనం చేసిందా?
దేవుడు యాకోబును వెళ్ళమని చెప్పాడు, కానీ అతను ఆలస్యం చేసాడు. అనేక సార్లు, దేవుని కుమారులు తిరిగి వెళ్ళమని చెప్పబడ్డారు: అబ్రాహాము – ఆదికాండము 13; ఇస్సాకు– ఆదికాండము 26; దావీదు – 2 సమూయేలు 12; యోనా - యోనా 3; మరియు పేతురు - యోహాను 21.
ఆదికాండము 35:2-5: దేవుడు ఆదేశించినట్లుగా, బేతేలుకు బయలుదేరే ముందు, యాకోబు తన కుటుంబానికి అన్య దేవతలందరినీ తొలగించి, శుద్ధి చేయబడి, వారి బట్టలు మార్చుకోమని చెప్పాడు. కానీ రాహేలు తన తండ్రి విగ్రహాలను
దొంగిలించింది. యాకోబు తన కుటుంబానికి కొత్త ప్రారంభం కావాలని సూచించాడు. అపవిత్రతను శుద్దిచేసుకొనమని లేఖనము నొక్కి వక్కాణిస్తుంది. (కీర్తన 51:2,7; యెషయా 1:16; 2 కొరింథీయులు 7:1; 1 యోహాను 1:9). శుద్దిచేసుకొనుటకు
నూతన వస్త్రాలు ఒక ప్రతిరూపం (యెషయా 64:6; ఆదికాండము 3:21). దేవుడు తన ప్రార్థనలకు జవాబిచ్చాడని యాకోబు ప్రకటించాడు! దేవుడు తమతో ఉన్నాడని యాకోబు మళ్లీ బహిరంగంగా ఒప్పుకున్నాడు!
యాకోబు విగ్రహాలను తీసుకుని పాతిపెట్టాడు. యాకోబు విగ్రహాలను షెకెము సమీపంలోని ఓకు వద్ద పాతిపెట్టాడు, అబ్రాము దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమైన ప్రదేశం (ఆదికాండము 12:6). యాకోబు మరియు అతని కుటుంబం వెళ్లడం ప్రారంభించినప్పుడు, వారు బయలుదేరిన వెంటనే వారి చుట్టూ ఉన్న నగరాలపై దేవుని నుండి భయం వచ్చింది! నిజమైన పునరుజ్జీవనం ప్రజలు కేవలం కూర్చునే ఉండునట్లు ఎన్నడూ సూచించదు! వైర్స్బే ఇలా వ్రాశాడు, "దేవుని ప్రజలు దేవుని మార్గంలో దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు, వారు దేవుని ఏర్పాటు మరియు రక్షణపై ఆధారపడగలరు."1
ఆదికాండము 35:6–7: యాకోబు బేతేలు పేరు మార్చి దేవుణ్ణి గుర్తించాడు. వాల్ట్కే ఇలా వ్రాశాడు, ఈ సమయంలో, "ఒడంబడిక కుటుంబం కనానీయుల నుండి వారు వేరుగానుండుటను నిలుపుకుంది, అది వారికే వారి సాక్షిగా ఉంది మరియు దేవుని వాగ్దానాల ఆధారంగా భూమిని ప్రతీకాత్మకంగా వారికే చెందుతుంది."2 వారు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు అనుసరించి కనానీయులలో తాము భాగం కాదని ప్రకటించారు. యాకోబు మరియు అతని కుటుంబ సభ్యులు దేవుడు తమకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడని విశ్వసించారు. ఇది మొదటి పునరుజ్జీవనమా? బహుశా కావచ్చు. వారు తమ విగ్రహాలను విడిచిపెట్టి, తమను తాము శుద్ధి చేసుకొని, కనానుకు వెళ్లిపోయారు.
ఆదికాండము 35:8-17: రెబెకా దాసియైన దెబోరా, ఆ కుటుంబంలో బలమైన ఉనికిని కలిగి ఉంది, మరణించింది మరియు సమాధి చేయబడింది. ఆమె ఇక్కడ జాబితా చేయబడటం చాలా పెద్ద విషయం; చాలా మటుకు, ఆమె యాకోబు జీవితంలో అంతర్భాగం. దేవుడు మళ్లీ యాకోబులో జీవితములో జీవం పోశాడు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల ద్వారా సంతానం వస్తున్నదని ప్రభువు నొక్కి వక్కాణించాడు. దేవుడు యాకోబుకు “ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు. యాకోబు అతనితో పోరాడినప్పుడు దేవుడు ఇలా చేశాడని మనకు తెలుసు. మన జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉంటుంది, మనం ఒక రోజు దేవునితో ఒక అవసరం కొరకు కలుసుకోవచ్చు మరియు మరుసటి రోజు మరొకటి అవసరం కొరకు ఆయన కలవాలి. ఈ వ్యక్తులు వ్యత్యాసముగా లేరు. దేవుడు ఇలా చెప్పాడు, "నేను సర్వశక్తిమంతుడను!" (ఎల్ షద్దాయి). దేవుడు యాకోబును ఫలించి విస్తరించమని చెప్పాడు, అతని నుండి ఒక జనాంగము వస్తుందని మరియు అతని నుండి రాజులు వస్తారని అతనికి గుర్తుచేశాడు
(2 సమూయేలు 7:12). దేవుడు అబ్రామును కలిసినప్పుడు ఆదికాండము 12 వలె, అతను యాకోబు నుండి వైదొలిగినప్పుడు భౌతికంగా ఉన్నాడు. ఆదికాండము 35:14–15: యాకోబు తాను దేవునితో మాట్లాడిన ప్రదేశాన్ని రాయితో గుర్తుపెట్టి దానికి బేతేలు అని పేరు పెట్టాడు (వ. 15). పానీయ నైవేద్యాన్ని పోయడం అనేది సమర్పణకు చిహ్నంగా ఉంది, ఒక వ్యక్తి తనకు ఉన్నదంతా ఇవ్వడం (2 సమూయేలు 23:16; ఫిలిప్పీయులు 2:17).
ఆదికాండము 35:16-17: వారు బేతేలు నుండి బయలుదేరారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పలేదు. రాహేలు వారి చివరి కుమారునికి జన్మనిచ్చింది, మరియు ప్రసవం కష్టతరమైనది. అది ఎందుకు కష్టమైనదంటే ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాము మరియు హవ్వల పతనం కారణంగా ఇది కష్టమైంది. పాపం యొక్క ఫలితాన్ని ఆమె కోసింది.
ఆదికాండము 35:18: రాహేలు తన కుమారునికి “బెన్-ఓనీ” అని పేరు పెట్టింది, అంటే, “దుఃఖపు కుమారుడు, కష్టాల కుమారుడు” అని పేరు పెట్టింది, అయితే యాకోబు అతనికి “బెంజమిన్” లేదా “నా కుడి చేతి కుమారుడు” అని తిరిగి పేరు పెట్టాడు. రాహేలు ప్రసవ సమయంలో మరణించింది. వారు బేతేలును విడిచిపెట్టినందువలన రాహేలుపై తీర్పు వచ్చిందా లేక ఆమె గతంలో చేసిన వ్యాఖ్యల వలన ఇలా కలిగిందా? మాకు ఖచ్చితంగా తెలియదు, కానీ యాకోబు అవిధేయుడిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ఉన్నాయి (అనగా దీనా అత్యాచారం మరియు రాహేలు మరణం). దేవుని శక్తి ఎల్లప్పుడూ మనం ఎవరో (అపరిపూర్ణత) అధిగమిస్తుంది, కానీ మన పాపానికి మనకు ఇంకా పరిణామాలైతే ఉన్నాయి. వైర్స్బే ఇలా అన్నాడు, “జీవితం అనేది వెలుగులు మరియు నీడలు, ఆనందం మరియు దుఃఖాల రంగుల వలయం; మరియు రాహేలు మరియు తన భర్తకు మరియు తనకు ఆనందాన్ని తెచ్చిన అదే శిశువు కూడా కన్నీళ్లు తెప్పించింది.”3
ఆదికాండము 35:19-21: రాహేలు ఎఫ్రాతా (బెత్లెహెం) వెళ్ళే మార్గంలో సమాధి చేయబడింది. ఇప్పుడు యాకోబును ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు.. మోషే అతనిని ఇశ్రాయేలు అని ఎప్పుడు పిలవాలో మరియు యాకోబును అని ఎప్పుడు సూచించాలో ఎంచుకున్నాడు. వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు, రూబెను తన తండ్రి ఉంపుడుగత్తె మరియు అతని తల్లి దాసి అయిన బిల్హాతో పడుకున్నాడు. రూబెను ఎందుకు ఇలా చేశాడనే దానిపై స్పష్టమైన కారణం లేదు. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, “ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.” (ద్వితీ.22:30). అతను చేసిన దాని కారణంగా, యాకోబు అతన్ని శపించాడు మరియు అతను ఇకపై రాణించలేడని చెప్పాడు. రూబెను తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు (ఆదికాండము 49:3-4).
ఆదికాండము 35:22–26: ఇశ్రాయేలులోని 12 తెగలు మళ్లీ జాబితా చేయబడ్డాయి: రూబెన్, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, యోసేపు, బెంజమిన్, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు (22-26 వ.).
ఆదికాండము 35:27-29: ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. అతను చనిపోయినప్పుడు, ఏశావు మరియు యాకోబు కలిసి వచ్చి తమ తండ్రిని పాతిపెట్టారు.
ముగింపు
వీటన్నింటి మధ్య ఎక్కడో ఆ సంతానము కొనసాగుతుంది.
3. వీయర్స్ బీ, p. 71.
వారెన్ W. వైర్స్బే, p. 69.
బ్రూస్ K. వాల్ట్కే మరియు కాతీ J. ఫ్రెడ్రిక్స్. జెనెసిస్: ఎ కామెంటరీ (జోండర్వాన్: గ్రాండ్ రాపిడ్స్, 2001), పే. 473.
ప్రశ్నలు
-
ఆదికాండము 34:1లో దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి ఎందుకు వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు?
దినవాక్యం
Laura Martin Genesis 35:2-3
“So Jacob said to his family and all who were with him, ‘Get rid of the foreign gods that are among you. Purify yourselves and change your clothes. We must get up and go to Bethel. I will build an altar there to the God who answered me in my day of distress. He has been with me everywhere I have gone.’”
యాకోబు తన ఏకైక కుమార్తెను తప్పుగా వెంబడించిన మనుష్యుల నుండి ప్రయోజనం పొందాలని చూశాడు. అప్పుడు అతను తన కుమారులు ప్రతీకారం తీర్చుకోవడం మరియు వారిని చంపడం చూశాడు. ఈ సమయంలో, యాకోబు దేవుని వైపు తిరిగాడు. అతను ఎక్కడికి వెళ్లినా దేవుడు యాకోబుతో ఉంటాడని దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు.
మీ లోపాల మధ్య లేదా కష్టాల మధ్యలో కూడా, ప్రభువుకు మొరపెట్టండి! మీ జీవితంలో దేవుని విశ్వసనీయతను తిరిగి చూసుకోండి మరియు ప్రభువు మీకు తోడుగా నిలిచిన సమయాలను గుర్తుంచుకోండి. మనలను విడిచిపెట్టబోమని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన మీ కోసం మరిన్ని ప్రణాళికలను కలిగి ఉన్నాడు!
“యాకోబు తన యింటివారితోను తన యొద్దనున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.”
— ఆదికాండము 35:2–3
తదుపరి లేఖన భాగములు
- కీర్తన 120:1 — “నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను..”
2 పేతురు 3:9 — “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”
మత్తయి 28:20 — “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.