The Pentateuch Genesis

Jacob Considers Returning To His Homeland

యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 31 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 16వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయము

మనము చదువుతున్న దేవుని వాక్యం మన నుండి బయటకు పంపించుటయే మన లక్ష్యం. మనం కేవలం స్పాంజ్‌లుగా ఉండకూడదు, ఆయన మాటలను మనకోసం దాచుకోవాలి. ఆదికాండము 30లో, యాకోబుకు 11 మంది కుమారులు ఉన్నారు మరియు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ లాబాను అతన్ని విడిచిపెట్టాలని కోరుకోలేదు. యాకోబు వెళ్ళే ముందు అతని వేతనాలు మచ్చలు మరియు పొడలు ఉన్న గొర్రెలు మరియు మేకలు ఇవ్వాలని నిర్ణయించబడింది (వ. 25–43). లాబాను మూడు రోజుల పర్యటనకు వెళ్ళినప్పుడు, యాకోబు చెట్ల బెరడులు తీయడం మరియు జంతువులు జతకట్టినప్పుడు ఒలిచిన కొమ్మలను తొట్టెలలో అమర్చడం ప్రారంభించాడు. ఏదో ఒకవిధంగా ఈ మూఢనమ్మకపు చర్య తనకు కావలసినది ఇస్తుందని యాకోబు భావించాడు. ప్రభువుపై నమ్మకం లేదు!

పాఠము

ఆదికాండము 31:1-2: లాబాను కుమారులు, “యాకోబు మనకు చెందిన దానిని తీసుకున్నాడు!” అని చెప్పారు. అసూయ రావడం ప్రారంభించబడింది. యాకోబును మోసం చేసింది లాబాను అని మనకు తెలుసు, అయితే దేవుని హస్తం యాకోబుపై ఉంది. యాకోబు ఏదో సమస్య ఉందని పసిగట్టాడు మరియు లాబాను ముఖం "అతనితో లేదు" అన్నాడు. ప్రభువు అతనితో ఉన్నాడు, కానీ లాబాను అతనితో లేడు. యాకోబు భార్యలకు ఉన్నట్లే అసూయ మరియు కడుపు మంట వేళ్లూనుకున్నాయి.

ఆదికాండము 31:3: దేవుడు యాకోబును పద్దనరామును విడిచిపెట్టి అతని పితరుల దేశమైన కనానుకు తిరిగి వెళ్లమని చెప్పాడు. ఈ విధంగా విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని దేవుడు యాకోబుతో ఎలా చెప్పాడో వైర్స్‌బే ప్రసంగించారు: “మన హృదయాల అంతర్గత సాక్షిగా, జీవిత బాహ్య పరిస్థితుల ద్వారా మరియు ఆయన వాక్య సత్యం ద్వారా.”1

దేవుడు యాకోబును ఎలా సంబోధించాడు (మరియు మనతో సంబోథిస్తున్నాడు!):

  1. మన హృదయం యొక్క అంతర్గత సాక్షి
  2. జాగ్రత్త! హృదయం అన్నింటికంటే మోసకరమైనది (యిర్మీయా 17:9).
  3. యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. (కీర్తనలు 37:4).
  4. అబ్రాహాము మరియు ఇస్సాకు యొక్క వాగ్దానాలు యాకోబుకు తెలుసు, మరియు దేవుడు వాగ్దానము చేసిన దానిని చేయాలని అతడు కోరుకున్నాడు.
  5. జీవిత బాహ్య పరిస్థితులు
  6. దేవుని వాక్యము
  7. యాకోబు బేతేలు వద్ద ఇవ్వబదిన వాగ్దానం చేత గుర్తుచేయబడ్డాడు (ఆదికాండము 28:12-15).
  8. యాకోబు ఏశావు వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పబడింది (ఆదికాండము 32:2-4).
  9. బేతేలుకు తిరిగి వెళ్ళమని దేవుడు యాకోబుతో చెప్పాడు (ఆదికాండము 35:1).
  10. యాకోబును ఐగుప్తు వెళ్లమని సూచించబడ్డాడు (ఆదికాండము 46:1-4).

పదే పదే, వ్యత్యాసమైన పనులు చేయమని యాకోబుకు సూచించబడింది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు! ఇదంతా ఆదికాండము 12:1-3 నకు తిరిగి వెళుతుంది. అబ్రాహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు వరకు వాగ్దానం. దేవుడు యాకోబుతో స్వదేశానికి తిరిగి వెళ్లమని చెప్పినప్పుడు, వాగ్దానం దగ్గరవుతున్నట్లు యాకోబు భావించవలసి వచ్చింది.

ఆదికాండము 31:4–9: మొదటి సారిగా, యాకోబు రాహేలు మరియు లేయా మరియు వారి అసూపై కాక తన స్వంత ఇంటిపై నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంద. యాకోబు రాహేలు మరియు లేయాలను ఒక ఒంటరి వాతావరణం గల మందలు ఉన్న ప్రదేశానికి పిలిచాడు,. రాహేలు మరియు లేయా తన వెనుక ఉన్నారని మరియు వారి తండ్రిని కాదని నిర్ధారించుకోవాలనుకున్నాడు. 2వ వచనం నుండి లాబాను యాకోబుకు భిన్నంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. యాకోబు తన స్వంత విశ్వాసాన్ని సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి! వస్తువులను కొనడం, వస్తువులను అమ్మడం లేదా ప్రజలను మోసగించడం కాదు. దేవుడు తన పక్షాన ఉన్నాడని యాకోబు గుర్తించాడు. లాబాను తన జీతాన్ని మార్చుకున్నాడని యాకోబు తన భార్యలకు వివరించాడు, కానీ దేవుడు మందలను మార్చాడు. 5వ వచనంలో వలె, యాకోబు దేవునికి ఘనత ఇచ్చాడు! దేవుడు మన అడుగులను నిర్దేశిస్తాడని కీర్తన 119:105 చూపిస్తుంది. యాకోబు వెళ్ళిన ప్రతిచోటా, దేవుడు దానిని నడిపించాడు. యాకోబు యొక్క అపరిపూర్ణతలో కూడా అతని జీవితంపై అభిషేకం మరియు పిలుపు ఉంది. అదంతా దేవునికి సంబంధించినదని యాకోబు చివరకు గ్రహించాడు!

ఆదికాండము 31:10-11: దేవుడు యాకోబుతో కల ద్వారా మాట్లాడాడు. దేవుడు ఇంకా కలల ద్వారా మాట్లాడుతున్నాడు (యోవేలు 2:28-29; అపొస్తలుల కార్యములు 2:17-19). ప్రభువు దినము వచ్చిందా? లేదు! అప్పుడు కలలు మరియు దర్శనాలు మరియు ప్రవచనాలు ఇంకా జరుగుతాయి. దేవుడు కలలు మరియు దర్శనాల ద్వారా మనతో మాట్లాడతాడు మరియు అది ఎల్లప్పుడూ అతని వాక్యపు సత్యానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, ముస్లింలు కలలు మరియు దర్శనాల ద్వారా ప్రభువును తెలుసుకుంటున్నారు. యాకోబు తన కలకి ప్రతిస్పందనగా "నేను ఇక్కడ ఉన్నాను!" అని చెప్పాడు.

ఆదికాండము 31:12-13: యాకోబు కలలో, ఒక దేవదూత కనిపించి, "ఆయన నీ కన్నులెత్తి చూడుము, నేను నీకు చూపించాలనుకుంటున్నాను!" దేవుడు యాకోబుకు ఇవ్వబోతున్నాడు; దానికి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. దేవుడు ఇచ్చేవాడు. బేతేలులో యాకోబు దేవునికి ప్రతిజ్ఞ చేసిన మొదటి కలను దేవుడు యాకోబుకు గుర్తు చేశాడు.

1. వారెన్ డబ్ల్యూ. వైర్స్‌బే, బీ అథెంటిక్ (జెనెసిస్ 25-50): ఎగ్జిబిటింగ్ రియల్ ఫెయిత్ ఇన్ ది రియల్ వరల్డ్ (కొలరాడో స్ప్రింగ్, డేవిడ్ సి. కుక్, 1997) p. 55.

ఆదికాండము 31:14-16: దేవుడు చేసినదంతా యాకోబు ప్రకటించాడు, ఇప్పుడు రాహేలు మరియు లేయా తమ తండ్రి లాబాను చేయని వాటిని ప్రకటించారు. లాబాను గతం, వర్తమానం మరియు భవిష్యత్తులో చేసిన చర్యలను భార్యలు చూశారు.2 వారు, “యాకోబు నువ్వు చెప్పింది నిజమే! మా నాన్న మాకు ఏమీ చేయలేదు, కానీ దేవుడు చేశాడు. దేవుడు యాకోబుకు ఈ ఇద్దరు స్త్రీలను ఇచ్చాడు, వారు అతని వెనుక నిలబడటానికి ఎన్నుకున్నారు.

ఆదికాండము 31:17-18: యాకోబు మరుసటి రోజు నిద్రలేచి తన భార్యలను మరియు పిల్లలను ఒంటెలపై ఉంచాడు. ఈ సమయంలో యాకోబుకు 11 మంది పిల్లలు ఉన్నారు: రూబెన్, షిమోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి మరియు యోసేపు.

యాకోబు తొందరపడ్డాడు. మనము తొందరపడి ప్రవర్తించకూడదని మనకు తెలుసు. యెషయా 28:16, “విశ్వసించువాడు కలవరపడడు..” మనం ప్రభువును విశ్వసించినప్పుడు మనం తొందరపడి పని చేయకూడదు. యాకోబు ఏశావు నుండి పారిపోయినప్పుడు కంటే లాబాను నుండి చాలా నెమ్మదిగా పారిపోయాడు. ఈసారి, యాకోబుకు అతని కుటుంబం మరియు ఆస్తులన్నీ ఉన్నాయి. లాబాను యాకొబును పట్టుకోవడానికి ఏడు రోజులు పట్టింది (ఆదికాండము 31:23).

ఆదికాండము 31:19: లాబాను గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు, అది సాధారణంగా వేడుక మరియు ఆశీర్వాద దినం, రాహేలు తన తండ్రి విగ్రహాలను దొంగిలించింది. రాహేలు తన తండ్రిని శిక్షించాలనుకుంది, లేదా ఆమె కొన్ని తప్పుడు నమ్మకాలను కలిగి ఉన్నందున ఆమె ప్రభువును పూర్తిగా విశ్వసించలేదు. లాబాను విగ్రహాలు చాలా మటుకు రెండు నుండి మూడు అంగుళాల బొమ్మలు, వీటిని ఆకర్షణీయమైనవిగా మరియు బహుశా వెళ్లిపోయిన పూర్వీకులుగా లేదా అస్వత్య దేవతల బొమ్మలుగా పరిగణించవచ్చు. ఈ విగ్రహాలు ప్రజల ఫలించుటకు ఉపయోగపడతాయని కూడా నమ్ముతారు. బహుశా రాహేలు తనకు అవి పిల్లలను ఇస్తాయాని భావించి వాటిని తీసుకుంది. ఈ సమయంలో ఆమెకు ఇంకా బెన్యామీను లేడని గుర్తుంచుకోండి.

ఆదికాండము 31:20-21: యాకోబు మళ్లీ మోసగాడయ్యాడు. అతడు ప్రభువును విశ్వసించక త్వరపడి వెళ్ళిపోయాడు. మోషే (ఆదికాండము రచయిత) ఈ సమయంలో లాబానును అరామియన్‌గా ఎందుకు పేర్కొన్నాడు? ఇక్కడ రెండు విభిన్న వ్యక్తుల సమూహాలు ఉన్నాయని దేవుడు చూపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. యాకోబు తన స్వదేశానికి మరియు సురక్షితంగా పారిపోయాడు. లాబాను వారిని వెంబడించాడు, మరియు రాహేలు విగ్రహాన్ని దొంగిలించి తప్పించుకుంది. చివరికి, యాకోబు మరియు లాబాను ఒక నిబంధన చేసుకున్నారు.

ముగింపు

ఇందులో దేవుడు ఉన్నాడని మొదటిసారిగా యాకోబు గుర్తించాడు. మరియు లేయా మరియు రాహేలు అతనితో నిలబడి ఉన్నారు. దేవుడు ఏదో ఒక పనిలో ఉన్నాడని వారు గ్రహించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదికాండము 31:42 ఇలా చెబుతోంది, “నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.” యాకోబు చివరకు దేవుని హస్తం తనపై ఉందని చూడటం ప్రారంభించాడు. మీరు యాకోబు నుండి నేర్చుకోవలసినది ఏమిటంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఓపికగా ఉండాలి. దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని చేయి నీపై ఉంది, అది నిన్ను విడిచిపెట్టదు.

  1. బ్రూస్ ఎఫ్. వాల్ట్కే మరియు కాతీ జె. ఫ్రెడ్రిక్స్, జెనెసిస్: ఎ కామెంటరీ (గ్రాండ్ రాపిడ్స్: జోండర్వాన్), పే. 426.

ప్రశ్నలు

  1. ఆదికాండము 31:3లో ప్రభువు యాకోబుతో మాట్లాడడం పూర్వావతారమైన క్రీస్తు అని మీరు అనుకుంటున్నారా?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Genesis 31:42

“If the God of my father, the God of Abraham, the Fear of Isaac, had not been with me, certainly now you would have sent me off empty-handed. But God has seen my afflic- tion and my hard work, and He issued His verdict last night.”

దేవుడు లాబాను మరియు యాకోబులిద్దరికీ కలలలో కనిపించాడు, వారి పాపపు మార్గాల మధ్యలో కూడా అతను వారితో ఉన్నాడని వారికి గుర్తు చేశాడు. దేవుడు చూస్తూన్నాడు మరియు ఆయన మన హృదయాలను తెలుసుకుంటాడు. దేవుడు మన పాపాన్ని చూస్తాడు - మనం దానిని ఉపేక్షించవచ్చు లేదా మనం దానిని కప్పిపుచ్చుకోవచ్చు మరియు తప్పించుకోవచ్చని భావించినప్పుడు కూడా. ఇప్పటికీ ఆయన మనల్ని చూస్తాడు.

మనం ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తాము? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. మీరు ఉన్నట్లుగా ఆయన ముందుకు రండి. ఆయన మిమ్మల్ని రూపాంతరం చెందించనివ్వండి.

“నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.”

— ఆదికాండము 31:42

తదుపరి లేఖన భాగములు

యెషయా 1:18 — “‘యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును..’”

సామెతలు 4:25–26 — “నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును..”

మత్తయి 6:22 — “దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.”