Major Prophets Ezekiel

The Valley Of Dry Bones

యేసును ఇలా కనుగొనండి: New David Ezekiel 37-38 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 642వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

యెహెజ్కేలు గ్రంథములోని 37వ అధ్యాయం అత్యంత సుపరిచితమైన మరియు ప్రసిద్ధమైన అధ్యాయాలలో ఒకటి, కానీ దాని అర్థం ఏమిటో బహుశా కొద్దిమందికే తెలుసు. దీని అర్థం మనకు వర్తించదు. కాబట్టి, యెహెజ్కేలు పుస్తకాన్ని చదువవలసిన అవసరం లేదులే అనే ధోరణి కలుగుతుంది. కానీ లేఖనలములన్నియూ మనలను సిద్ధం చేయడానికి మరియు యేసు వైపుకు చూపించడానికి సహాయపడతాయి.

యెహెజ్కేలు 36వ అధ్యాయంలో, యెహెజ్కేలు పర్వతాలతో మాట్లాడాడు. అతను మొదట దేశ పునరుద్ధరణ గురించి మాట్లాడాడు. రెండవది, యెహెజ్కేలు 36వ అధ్యాయం హృదయ పునరుద్ధరణ గురించి మాట్లాడాడు. యెహెజ్కేలు చెరలో ఉన్న వారితో నేరుగా మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏదో ఒక రోజు విడుదల చేయబడతారని, చివరికి వారికి జీవితం తిరిగి వస్తుందని అతను చెప్పాడు. ఈ సందేశం ప్రత్యేకంగా వారి కోసమే. యెహెజ్కేలు ఈరోజు మన దేశ సంఘముతో మాట్లాడటం లేదు. ఈ సందేశం యెహెజ్కేలు కాలంలో చెరలో ఉన్నవారి కోసం.

పాఠము

యెహెజ్కేలు 37: యెహెజ్కేలు ఎండిన ఎముకలతో నిండిన లోయ మధ్యలోకి తీసుకురాబడ్డాడు. యెహెజ్కేలు ఈ లోయ యొక్క చిత్రాన్ని మరియు అతను ఎముకల మధ్య ఎలా నడిపించబడ్డాడో చిత్రించాడు. 1–14 వచనాలు “ఒక జాతి తిరిగి జన్మించడం” గురించి అని వియర్స్బే చెబుతున్నాడు.1 మరల, యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నాడు.

మాక్‌ఆర్థర్ ప్రకారం, “ఈ భాష చనిపోయిన దేశాన్ని నిర్జీవంగా, చెల్లాచెదురుగా మరియు తెల్లబారినదిగా చిత్రీకరిస్తుంది, ఎండిన చెట్టు (యెహెజ్కేలు 17:24) చనిపోయిన దేశాన్ని సూచిస్తుంది, దానికి దేవుడు మాత్రమే జీవం ఇవ్వగలడు. అనేక ఎండిన ఎముకలు (2 వ) ఇశ్రాయేలు దేశాన్ని (11 వ) స్పష్టంగా చెదరగొట్టబడి జాతీయ పునరుత్థానం కోసం వేచి ఉన్నట్లు చిత్రీకరిస్తాయి. వ్యక్తిగత పునరుత్థానం యొక్క సిద్ధాంతం గురించి ప్రజలకు తెలుసు, లేకపోతే ప్రవచనానికి అర్థం ఉండేది కాదు (1 రాజులు 17; 2 రాజులు 4; 13:21; యెషయా 25:8; 26:19; దానియేలు 12:2; హోషేయ 13:14).”2 దేవుడు మాత్రమే ఎండిన ఎముకల లోయకు జీవం ఇవ్వగలడు. ఆ చిత్రం చనిపోయిన చెక్క లాంటిది, దేవుడు మాత్రమే తిరిగి జీవం పోయగలడు.

4–8 వచనంలో ఎండిన ఎముకలకు ప్రవచించమని యెహెజ్కేలుకు చెప్పబడింది. యెహెజ్కేలు ఎండిన ఎముకలతో, “యెహోవామాట ఆలకించుడి!” అని అన్నాడు. యెహెజ్కేలు పరిశుద్ధాత్మను వినడానికి ఎంతగానో ప్రాధాన్యతనిచ్చాడు, అతను సంకోచించకుండా దేవుని నిర్దేశాన్ని అనుసరిస్తాడు. సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశములో ఉన్నాయని చెబుతుంది. యోహాను 6:63 ఆత్మ జీవమునిచ్చుటను సూచిస్తుంది. యెహెజ్కేలు దేవుని ఆత్మతో నిండి ఉన్నాడు., జీవమునిచ్చేది ఆత్మయేగాని శరీరము కాదు.

తాను మాట్లాడే ప్రతి మాట ఫలిస్తుందని యెహెజ్కేలు నమ్మాడు. ఆ నిరీక్షణతో ఆయన ప్రభువు వాక్కును విడుదల చేశాడు. నీతిమంతుల నోరు వాక్యమును తీసుకురావడం ద్వారా జీవమును తెస్తుందని సామెతలు 10:11 ప్రస్తావిస్తుంది. నీతిమంతుల మాటలు ప్రజలను ప్రభువు వైపుకు నడిపించాలి.

యెహెజ్కేలు 37:7–8: యెహెజ్కేలు మాట్లాడుతున్నప్పుడు ఎముకలు ప్రాణం పోసుకున్న వృత్తాంతం. ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మానవులు ఏర్పడుతున్నారు, కానీ వాటిలో శ్వాస లేదు.

యెహెజ్కేలు 37:9–10: 9వ వచనం ద్వారా ఆ నిర్జీవ శరీరాలు ప్రాణం పోసుకునేలా నలుదిక్కుల నుండి ఊపిరి విడుచుటకు ప్రవచించమని యెహెజ్కేలుకు చెప్పబడింది. యెహెజ్కేలు మొదట ఎముకలతో మాట్లాడాడు, తరువాత అతను ఊపిరితో మాట్లాడాడు. అతను చూస్తుండగా, ఎముకలు శరీరాలుగా మారాయి. శరీరాలకు ఊపిరి ఇవ్వబడింది మరియు ఒక విస్తారమైన సైన్యం ప్రాణం పోసుకుంది.

యెహెజ్కేలు 37:11–14: 11వ వచనం సైన్యాన్ని మొత్తం ఇశ్రాయేలు ఇంటితో పోలుస్తుంది. యెహెజ్కేలు ద్వారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 36వ అధ్యాయంలో ప్రవచించబడినట్లుగా ఇశ్రాయేలు దేశానికి వారిని నడిపిస్తానని చెప్పాడు. ఇది ప్రభువు ప్రకటన. ఈ సందేశం ఇశ్రాయేలు జాతి కోసం, కానీ దీనికి మన ప్రస్తుత పరిస్థితులకు కూడా అన్వయించే అంశాలు ఉన్నాయి.

యెహెజ్కేలు 37:15–23: 16వ వచనంలో యెహెజ్కేలు కఱ్ఱతునకలపై రాశాడు. ఒక కఱ్ఱతునక ఇశ్రాయేలును సూచిస్తుంది, మరియు మరొక కఱ్ఱతునక యూదాను సూచిస్తుంది. ఆ కఱ్ఱతునకలు యెహెజ్కేలు చేతిలో ఒకటే తునకగా ఆయెను. ఇది ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాలు తిరిగి కలిసి రావడాన్ని సూచిస్తుంది. సొలొమోను పాలన తర్వాత రాజ్యాలు విడిపోయాయి, కాబట్టి 390 సంవత్సరాలుగా, రాజ్యాలు విభజించబడ్డాయి.

చెదరిపోయి ఉన్న ప్రజలను దేవుడు సేకరిస్తాడు, మరియు వారు ఇకపై రెండు దేశాలుగా ఉండరు. వారు ఒకే దేశంగా ఉంటారు మరియు ఒకే రాజు ఉంటారు (వచనాలు 21-22). వారు రాజులకు రాజు అయిన యేసు కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ఇశ్రాయేలు ప్రజలందరిపై రాజు అవుతాడని మత్తయి రాశాడు.

యెహెజ్కేలు 37:24–28: 25వ వచనం ప్రజలు యాకోబుకు ఇవ్వబడిన దేశంలో నివసిస్తారని చెబుతుంది. వారి పిల్లలు మరియు మనవరాళ్ళు ఆ దేశంలో నివసిస్తారని చెబుతుంది. దేవుని సేవకుడు, కొత్త దావీదు, మెస్సీయ, వారి యువరాజుగా శాశ్వతంగా వస్తాడు.

శాంతి నిబంధన వాగ్దానం చేయబడింది. దేవుడు వారి దేవుడు అవుతాడు మరియు వారు దేవుని ప్రజలు అవుతారు. ఆలయం స్థాపించబడుతుంది. దేవుడు ఇశ్రాయేలును పవిత్రం చేశాడని అన్ని దేశాలు తెలుసుకుంటాయి.

సమాధాన నిబంధన పునరుద్ధరించబడింది. దేవుడు తన సమాధానమును ప్రజల నుండి తొలగించాడని యిర్మీయా 16:5 వివరిస్తుంది. యెషయా 9లో సమాధాన అధిపతి రావాలని ప్రజలు ప్రార్థించమని చెప్పబడింది. అనేక కీర్తనలు యెరూషలేము సమాధాన కోసం ప్రార్థించమని కూడా ప్రజలకు నిర్దేశిస్తాయి. వీటిలో ఏదైనా జరిగి సమాధాన నిబంధనను తిరిగి స్థాపించగలిగే ఏకైక మార్గం సమాధానమునకు రాజైన యేసు ద్వారానే. తీసివేయబడిన సమాధానమును పునరుద్ధరించగల ఏకైక వ్యక్తి యేసు.

ముగింపు

యేసు, దేవుని ఆత్మ ద్వారా, మనకు జీవితాన్ని ఇవ్వగలడు. ఎండిన ఎముకల లోయలో మనం చూసేది అదే. రెండు కర్రతునకల ఐక్యతలో మనం చూసేది అదే. విభజించబడిన రాజ్యం కలిసి వచ్చినప్పుడు మనం చూసేది అదే. ఐక్యత ఉన్నప్పుడు, దేవుడు వీటన్నిటిలో ఒక భాగమని ప్రజలకు తెలుసు. యేసు మనం ఆత్మలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ఒకటిగా ఉండటం గురించి ఆయన మాట్లాడాడు, కానీ క్రీస్తు శరీరం కూడా ఒకటిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.

లేఖనంలోని ఈ వృత్తాంతం ఆశను కలిగించాలి. ఇశ్రాయేలు శత్రువు అయిన గోగు ఆ సమాధానమును పొందకుండా నిరోధించాలని కోరుకున్నాడనే కథనం ఉన్నప్పటికీ, తరువాతి అధ్యాయాలు శాంతి సందేశాన్ని కలిగి ఉన్నాయి. చివరికి యెహోవా వచ్చి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై తీర్పును తెస్తాడు.

మీకు వ్యతిరేకంగా ఏమి వచ్చినా, ఒక విషయం మాత్రం నిశ్చయం, మీరు సమాధాన అధిపతిపై విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు.

  1. వారెన్ డబ్ల్యూ. వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్, డేవిడ్ సి. కుక్, 1989), పేజీ 230.

  2. జాన్ మాక్‌ఆర్థర్, ది మాక్‌ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజీ 711.

ప్రశ్నలు

  1. యెహెజ్కేలు 37:1–14 లోని ఎండిన ఎముకల లోయ దర్శనం, అవిశ్వాసి క్రీస్తులో నూతన జీవితానికి వస్తున్నాడనడానికి ఉదాహరణగా ఉంటుందా? ఎందుకు లేదా ఎందుకు కాదు?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Ezekiel 37:3–5

“Then He said to me, ‘Son of man, can these bones live?’ I replied, ‘Lord GOD, only You know.’ He said to me, ‘Prophesy concerning these bones and say to them: Dry bones, hear the word of the LORD! This is what the Lord GOD says to these bones: I will cause breath to enter you, and you will live.’”

యెహోవా హస్తము యెహెజ్కేలుపై నిలిచి, ఆయన ఆత్మ యెహెజ్కేలును ఎండిన ఎముకల లోయకు నడిపించింది. ప్రభువు యెహెజ్కేలును ఎముకలకు ఇలా ప్రవచించమని ఆజ్ఞాపించాడు: “ఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి! . . . మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను! . . . అప్పుడునేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.” యెహెజ్కేలు ప్రభువు ఆజ్ఞాపించినట్లు చేసాడు, మరియు ఎండిన ఎముకలు ప్రాణం పోసుకున్నాయి.

ఒక విశ్వాసిగా, యేసు మీకు జీవం పోస్తాడు. ఆయన మీలో నివసిస్తున్నాడు. ఆయన మీకు పూర్తి పునరుద్ధరణను వాగ్దానం చేస్తాడు. చనిపోయిన నిద్ర నుండి మిమ్మల్ని మేల్కొలిపి, మీ ఆత్మను పునరుద్ధరిస్తానని ఆయన వాగ్దానం చేస్తాడు. యెహెజ్కేలు దేవుని నిర్దిష్ట ఆజ్ఞలను అనుసరించాడు, ఎముకలపై జీవితాన్ని మాట్లాడాడు మరియు ఆ ఎముకలు ప్రాణం పోసుకున్నాయి. నేడు, మీరు జీవితాన్ని కనుగొనాల్సిన మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి లేదా పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, యేసు యొక్క జీవాన్ని ఇచ్చే శక్తిని మోసేవారిగా మారడానికి ఎంచుకోండి. మీ ఇంటికి, మీ జీవిత భాగస్వామికి, మీ బిడ్డకు లేదా మీ స్నేహితుడికి ఆశ మరియు ప్రేమ యొక్క మాటలను మాట్లాడటం ప్రారంభించండి. దేవుని ఆత్మ వారిని యేసు నామంలో, జీవితంతో, శక్తితో మరియు ప్రేమతో లేపును గాక. ప్రజలు ఇకపై చనిపోయినట్లుగా జీవించకూడదు. ఈరోజే, ఆయన వాక్యంలో యేసు వైపు తిరగండి, ఆయన ప్రజలతో కూడా ఆయన సన్నిధిని అనుసరించండి మరియు ఆయన ఆత్మ మీలోకి మరియు మీ చుట్టూ ఉన్నవారిలోకి జీవం పోయడానికి అనుమతించండి!

“​​​ఆయననర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగాప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. అందుకాయనప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుముఎండి పోయిన యెముకలారా, యెహోవామాట ఆలకించుడి. ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగామీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను;”

  • యెహెజ్కేలు 37:3–5

తదుపరి లేఖన భాగములు

సామెతలు 18:21 — “జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు”

యెహెజ్కేలు 37:10 — “ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.”

యోహాను 6:63 — “"ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, గాని"”