The Pentateuch Exodus

Making the Priestly Garments

యేసును ఇలా కనుగొనండి: Deliverer Exodus 39 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 50వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయము

నిర్గమకాండము నిరంతరం మనం దేవుని సన్నిధిని ఎలా అనుభవించవచ్చో సూచిస్తూ ఉంటుంది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషే మరియు ఇశ్రాయేలీయులకు సూచించబడింది. నిర్గమకాండము 37 మరియు 38లో, ప్రజలు గుడారపు విడి భాగాలన్నింటినీ నిర్మించారు. నిర్గమకాండము 39 యాజకులకు వస్త్రాలను తయారు చేయడానికి సూచనలను ఇస్తుంది.

పాఠము

నిర్గమకాండము 39:1: రైకెన్ ఇలా వ్రాశాడు, "వెర్న్ పోయ్‌థ్రెస్స్ [యాజకులను] 'గుడారపు నిలువు ప్రతిరూపాలు'గా వర్ణించాడు."1 గుడారం వెలుపల ఉన్న నూలు యాజకుల వస్త్రాల నూలు వలె కనిపించింది. అహరోను చాలా తప్పులు చేసినప్పటికీ మరియు బంగారు విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి అయినప్పటికీ, అతను ఇప్పుడు దేవుని సన్నిధికి బాధ్యత వహించబోతున్నాడు. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు! ఆయన విమోచించే దేవుడు! మనలో ప్రతి ఒక్కరూ తప్పులు చేశారు. అహరోను ప్రభువు యొక్క పని చేయడానికి నీటితో కడుగబడి శుద్ధి చేయబడాలి (నిర్గమకాండము 40:12). అహరోను తన వస్త్రాల కారణంగా చిన్న ప్రత్యక్ష గుడారం అయ్యాడు.2 మీరు దాని గురించి ఆలోచిస్తే, మనమందరం కాదా?

నిర్గమకాండము 39:2-5: బెసలేలు యాజక వస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలను తయారు చేయబోతున్నాడు. అతడు మొదటిగా చేసిన ఏఫోదును తయారు చేశాడు, ఆపై అతను భుజం మెత్తలు తయారు చేశాడు. ప్రాథమికంగా, యాజకుడు రాయబారిగా పనిచేశాడు. దేవుడు అహరోను మరియు అతని కుమారుల ద్వారా (2 కొరింథీయులకు 5:20) మరియు ఇప్పుడు మన ద్వారా అక్షరాలా వేడుకుంటున్నాడు! దేవునితో సమాధానపడమని మేము క్రీస్తు తరపున మనవి చేస్తున్నాము. అప్పుడు నడుము కట్టు తయారు చేయబడింది, "ప్రభువు ఆజ్ఞాపించినట్లు." వారు మూలలను కత్తిరించడం లేదు. ప్రభువు తమను చేయమని కోరిన దానిని వారు గౌరవించారు. వింతగా ఉన్నా లేదా అర్ధం కాకపోయినా పరిశుద్ధాత్మ చెప్పేది చేయండి.

నిర్గమకాండము 39:6-21: గోమేధికపు రాళ్లలో 12 మంది కుమారులు (12 గోత్రములు) చెక్కబడి ఉన్నాయి. "ఇశ్రాయేలీయులు ఎవరో మీరు గుర్తుంచుకోవాలని మరియు వారిని నా ముందుకు తీసురావాలని నేను కోరుకుంటున్నాను" అని ప్రభువు చెప్పాడు. ఆ తర్వాత చాతి దట్టీ 12 రాళ్లతో తయారు చేయబడింది, అది యాజకుని చాతిపై పెట్టబడింది. యాజకుడు దేవుని ప్రజలను దేవుని సింహాసనం ముందు తీసుకెళ్లాలి.

నిర్గమకాండము 39:22-29: తదుపరి వస్త్రం పూర్తిగా నీలి రంగుతో తయారు చేయబడింది. అప్పుడు వారు మణికట్టు, తలపాగా మరియు చొక్కాలను తయారు చేశారు.

నిర్గమకాండము 39:30-31: పతకం తలపాగా మీద వేయబడింది. ప్రతిదీ, " యెహోవా పరిశుద్ధుడు". ప్రతిదీ ఒక ప్రయోజనం కోసం జరిగింది. డేవిడ్ లెవీ మనకు ఈ వస్త్రాలు ఎందుకు అవసరమో మూడు ప్రధాన కారణాలను ఎత్తి చూపాడు: (1) పరిశుద్ధత - ప్రత్యేకపరచుటకు; (2) మహిమ -అది యాజక పదవిని ఉన్నతపరుస్తుంది; మరియు (3) అందం- ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిబింబిస్తుంది.3 ఇవన్నీ దేవుణ్ణి ప్రతిబింబిస్తాయి.

ఈ యాజకులు పరిపూర్ణులు కాదు. అహరోను బంగారు దూడను రూపొందించినప్పుడు నిర్గమకాండము 32 చూడండి (కీర్తనలు 132:9). అహరోను మరియు లేవీయుల యాజకులు నీతిని ధరించడానికి వారు చేయగలిగినదంతా చేశారు మరియు పరిశుద్ధతతో ప్రభువు సన్నిధికి రావడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు ఇంకా వెనుకబడ్డారు. లేవియకాండములో, యాజకులు ఇప్పటికీ పాపం చేశారు. వారు తమ తరుపున, క్రమ పద్ధతిలో అర్పణలు చేయాల్సి వచ్చింది. మనకు ప్రత్యేకమైన ప్రధాన యాజకుడు కావాలి. అహరోను ప్రధాన యాజకుడు, కానీ యేసు గొప్ప ప్రధాన యాజకుడు (హెబ్రీయులు 4:14; 10:21).

ప్రధాన యాజకుడైన అహరోను కంటే యేసు ఎందుకు గొప్పవాడో నేను (ఫిలిప్ రైకెన్) మీకు తెలియజేయాలనుకుంటున్నాను: 4

  • యేసు ఉన్నత స్థలములో సేవ చేస్తున్నాడు.(హెబ్రీయులు 8:1–2). గుడారపు తెర లోపల కాకుండా యేసు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు, అతను నిజమైన గుడారమనబడే పరలోకములో సేవ చేస్తున్నాడు.
  • యేసు ఉన్నతమైన నీతితో సేవ చేస్తున్నాడు.( (హెబ్రీయులు 7:26-28). ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి మరియు నిష్కల్మషుడు. ఆయన ప్రతిరోజూ బలులు అర్పించాల్సిన అవసరం లేదు; అయన దీనిని ఒకసారే చేసాడు, నిత్య పరిపూర్ణుడు.
  • యేసు ఉన్నతమైన సానుభూతితో సేవ చేస్తున్నాడు.( (హెబ్రీయులు 4:15-16). ఆయన మనతో నివాసము చేయగలడు కాబట్టి, మనం అయనతో కలసి ఉండవచ్చు. ధైర్యంతో ఆయనను చేరుకొనండి.
  • యేసు ఉన్నతమైన దీర్ఘాయువుతో సేవ చేస్తున్నాడు.( (హెబ్రీయులు 7:23-25). అతను శాశ్వతంగా ఉంటాడు మరియు శాశ్వతంగా తన యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. అందువల్ల, ఆయన ఎల్లప్పుడూ రక్షించగలడు.
  • యేసు ఉన్నతమైన త్యాగం సేవ చేస్తున్నాడు.( (హెబ్రీయులు 9:12, 25–26). ఆయన శాశ్వతమైన విముక్తిని అందజేస్తాడు, ఒక్కసారే!

వారికి పవిత్ర వస్త్రాలు ఉన్నప్పటికీ వారు యేసును ఎలా చూపారు, లేవీయుల యాజకత్వం ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. కానీ అది ఇప్పటికీ మనల్ని క్రీస్తు వైపు చూపిస్తుంది (1 పేతురు 2:4-5, 9; ప్రకటన 1:5b-6). ఇవన్నీ మనం దేవుని సన్నిధిని అనుభవిస్తున్నట్లు సూచిస్తున్నాయి. పరిశుద్ధ గుడారంలో దేవుని యెదుట వారికి ప్రాతినిధ్యం వహించడానికి వారికి ఒక యాజకుడు అవసరం.

నిర్గమకాండము 39:32–33: పనంతా పూర్తయింది! వస్త్రాలు "ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే." తయారు చేయబడి మరియు పూర్తి చేయబడ్డాయి, ఈ పని కేవలం బెసలేలు, ఒహోలియాబు లేదా మోషే ద్వారా మాత్రమే జరగలేదని గమనించండి. ఇతరులకు దేవుని సన్నిధిని అనుభవించడం సాధ్యమయ్యేలా ఒక జట్టు ప్రయత్నం. దేశం మొత్తం ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. వారు మోషే దగ్గరకు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొచ్చారు.

నిర్గమకాండము 39:34-41: నిర్మించమని దేవుడు వారికి సూచించిన అన్ని వస్తువులను ఇశ్రాయేలీయులు జాబితా చేయడం ప్రారంభించారు. జాన్ మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, "ఇది పూర్తిగా ఆయన నిర్మాణం మరియు ప్రతి స్థాయిలో అయన రూపకల్పన.”5 రాబోవుచున్న మెస్సీయాను సూచించడానికి వారు ఇవన్నియు తీసుకువచ్చారు.

నిర్గమకాండము 39:42-43: ఇశ్రాయేలీయులు అన్ని పనులన్నీ పూర్తిచేసారు. వారు ఎలాంటి దగ్గర దారులు తీసుకోలేదు. మోషే అన్నింటినీ పరిశీలించాడు. మోషే ప్రజలను ఆశీర్వదించాడు; మనం దీనిని గ్రంథంలో చూడటం ఇదే మొదటిసారి.

ముగింపు

హెబ్రీయులు 3:1-6లోని యేసు చేసిన పనిని మరియు మోషే చేసిన పనిని లోతుగా అధ్యయనం చేయుట కొరకు మరియు పోల్చడం కొరకు కొంత సమయం వెచ్చించండి. విమోచకుడైన మోషే చివరికి యేసునే అసలైన విమోచకునిగా సూచించాడు.

ప్రశ్నలు

  1. నిర్గమకాండము 39లోని అహరోను యొక్క యాజక వస్త్రాల వర్ణన, ఉపయోగించిన పదార్థాలు మరియు రంగులకు సంబంధించి గుడారపు వర్ణన వలె చాలా ధ్వనిస్తుంది. దేవుడు మోషేకు సూచనలను ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకున్నాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Exodus 39:42-43

"The Israelites had done all the work according to everything the Lord had commanded Moses. Moses inspected all the work they had accomplished. They had done just as the Lord commanded. Then Moses blessed them.”

మీరు ఏఫోదు, రొమ్ము మీదనున్న పతకము, మరియు యాజక వస్త్రాలను తయారు చేయడానికి సంబంధించిన వివరణాత్మక సూచనలను చదువుతున్నప్పుడు, "ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినట్లు" అనే పదబంధాన్ని తొమ్మిది వేర్వేరు సార్లు మీరు చూస్తారు. మీరు ఒక అధ్యాయంలో చాలాసార్లు పునరావృతమయ్యే పదబంధాన్ని చదివినప్పుడు, గమనించండి. నైపుణ్యంగల ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదానికీ కట్టుబడి ఉన్నారు. ఇవ్వబడిన వివరాలలో ఒక్కటి కూడా విడిచిపెట్టబడలేదు.

క్రొత్త నిబంధనలో, యేసు ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో మరియు నీ పూర్ణ మనస్సుతో ప్రేమించుట మరియు ఇతరులను నిన్ను వలె ప్రేమించుటయే గొప్ప ఆజ్ఞ అని చెప్పాడు. మీరు ఈ ఆజ్ఞకు విధేయత చూపుతున్నారా? ప్రభువుకు విధేయత చూపడమే ప్రేమ. మీరు యేసు నుండి కృపను పొందినప్పుడు, ఆ ఆజ్ఞలనుండి విశ్వాసముతో బయటికి వెళ్లగలరు.

“యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు ఇశ్రాయేలీ యులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.”

నిర్గమకాండము 39:42–43

తదుపరి లేఖన భాగములు :

మత్తయి 22:35–39 — “వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”

రోమా 1:5 — “యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.”

2 యోహాను 1:6 — “మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.”