The Final Plague Threatened
యేసును ఇలా కనుగొనండి: Deliverer Exodus 11 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
ఈ రోజు మనము పదవ మరియు చివరి తెగులు గూర్చి నేర్చుకోబోతున్నాము. నిర్గమకాండము 7—10లో వివరించిన తొమ్మిది తెగుళ్లను సమీక్షిద్దాం: (1) నీరు రక్తంగా మారింది, (2) కప్పలు, (3) దోమలు, (4) ఈగలు, (5) పశువుల మరణం, (6) గడ్డలు, (7) వడగళ్ళు, (8) మిడతలు, మరియు (9) చీకటి. చైల్డ్స్, బైబిల్ వ్యాఖ్యాత, 11వ అధ్యాయంలోని సంఘటనలు తెగుళ్ల పరాకాష్టకు మరియు పస్కా సంప్రదాయానికి నాంది అని చెప్పారు.1
పాఠము
నిర్గమకాండము 11:1: దేవుడు మోషేకు ఎన్ని తెగుళ్లు వస్తాయో చెప్పలేదు. ఇప్పుడు, ఈ తెగులు చివరిది అని దేవుడు వెల్లడించాడు ఆ తరువాత ఫరో వారిని విడిచిపెట్టాడు. అంతం రాబోతుందని మోషే చూశాడు. ఫరో “మిమ్మల్ని తరిమివేస్తాడు” అని దేవుడు చెప్పాడని గమనించండి. ఈ పదము "నెగా" అనే పదము నుండి అనువదించబడింది, ఇది తెగుళ్లు, వ్యాధులు, గాయాలు కోసం వాడే ఒక సాధారణ పదం. ఇది ఏదైనా తాకినప్పుడు సూచించే నామవాచకం. దేవుడు యాకోబు తొడను "తాకినప్పుడు" గుర్తుందా (ఆదికాండము 32:25)? ఇప్పుడు దేవుడు ఐగుప్తీయులను తీవ్రంగా ఉండే విధంగా "తాకబోతున్నాడు". ఐగుప్తీయులు ఇప్పటికే కొంతవరకు దేవుని నుండి ఈ స్పర్శను అనుభవించారు. ఆదికాండము 12:17లో, "అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను." ఐగుప్తీయులు తన ప్రజలకు చేసిన దాని కారణంగా దేవుడు ఈ తీర్పును తీసుకువచ్చాడు. సామెతలు 6:32-33లో వివరించిన భావన ఇదేనని హామిల్టన్ చెప్పాడు, ఇది వ్యభిచారిపై "స్పర్శ" కలిగించడానికి భర్తను అనుమతించింది.2
నిర్గమకాండము 11:2: ఇశ్రాయేలులోని స్త్రీపురుషులందరినీ తమ ఐగుప్తు పొరుగువారిని వెండి మరియు బంగారు నగలు అడగమని చెప్పమని దేవుడు మోషేతో చెప్పాడు. ఇది చిన్న అభ్యర్థన కాదు. 991 BCలో, వారు 42 పౌండ్ల కంటే ఎక్కువ బరువుగల పాతిపెట్టిన నెక్లెస్‌ను కనుగొన్నారు. ఇది చాలా దోపిడీ! దేవుడు మోషేకు ముందే వాగ్దానం చేసాడు (నిర్గమకాండము 3:22). మరియు నిర్గమకాండము 12:36 లో, ఇది వాస్తవానికి జరిగింది.
నిర్గమకాండము 11:3: “యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ప్రజలకు అనుగ్రహం ఇచ్చాడు. మరియు మోషే అనే వ్యక్తి ఇగుప్తు దేశంలో ఫరో అధికారులు మరియు ప్రజలచే ఎంతో గౌరవించబడ్డాడు. ఇశ్రాయేలీయులు చాలా దుఃఖాన్ని అనుభవించారు, ఇప్పుడు ప్రభువు వారిపై తన అనుగ్రహాన్ని కుమ్మరించాడు. ఫరో అధికారులు వడగళ్ళు వస్తున్నట్లు గ్రహించి, దేవునికి భయపడి, మోషే చెప్పిన మాటలను నమ్మి తమ పశువులను తెచ్చుకున్నారని గుర్తుందా? ఇక్కడ మళ్ళీ, జరుగినదానిని చూసి ప్రజలు దేవునికి భయపడ్దారు. ఫరో ఒక్కడు మాత్రమేదానిని చూడలేదు.
ఐగుప్తులో మోషేకు “అత్యున్నతమైన గౌరవం” ఉంది. మొర్దెకైని పారసీక ప్రజలు "అత్యంతగా గౌరవించేవారు" అని వర్ణించిన ఎస్తేరు 9:4లో ఇదే భాష ఉపయోగించబడింది.3 వ్యాపారం లేదా పరిచర్య లేదా ఇంటిపై దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో మీరు చూడవచ్చు. మోషే విధేయత చూపడం వల్లనే అతనికి అలా జరిగింది, అతను అలాగే ఉన్నాడు కూడా.
నిర్గమకాండము 11:4: మోషే ఇలా అన్నాడు, " యెహోవా సెలవిచ్చిన దేమనగా - మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను." మనం సాధారణంగా అర్ధరాత్రి జరిగే చెడు విషయాల గురించి ఆలోచిస్తాము. ఏది ఏమైనప్పటికీ, లేఖనములో అర్ధరాత్రి కొన్ని సానుకూల సంఘటనలు జరిగాయి: కీర్తన 119:62 "న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను." అని మనలను ప్రోత్సహిస్తుంది. అపొస్తలుల కార్యములు 16:25 పౌలు మరియు సీలలు అర్ధరాత్రి ఖైదీలందరూ తమ మాటలను వింటున్నప్పుడు దేవునికి ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు పాడుతున్నట్లు వివరించింది. "నేను వెళ్తాను" అనే ప్రకటనను గమనించండి, అంటే ప్రభువు ఐగుప్తు గుండా వెళతాడు. ఇది రాబోవు అవతారానికి ముందుగా సిద్ధపడడం.4 దేవుడు ఐగుప్తు అంతటా వెళ్లి ఇశ్రాయేలీయులకు విమోచన తీసుకుస్తాడు.
నిర్గమకాండము 11:5:అయితే, మరియు, కాని లు లేవు - దేవుడు తన తీర్పును అమలు చేసినప్పుడు, ఐగుప్తు దేశంలో ప్రతి తొలి మగపిల్లవాడు చనిపోతాడు. ఫరో ఈ తీర్పు నుండి తప్పించుకోలేడు. ఇక సోపానక్రమం లేదు. ఇది పశువులతో సహా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. ఆదికాండము అంతటా, మేము మొదటి సంతానం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత గురించి మాట్లాడాము. కయీను మరియు హేబేలు, యాకోబు మరియు ఏశావు మరియు ఇశ్రాయేలు యొక్క 12 తెగల గురించి ఆలోచించండి. కాన్స్టేబుల్ మాట్లాడుతూ జ్వేష్ఠ కుమారులు దేశం యొక్క శక్తి మరియు బలముకు సంకేతమని అన్నారు. జ్వేష్ఠ కుమారుని ద్వారా కుటుంబ శ్రేణులు వచ్చాయి.5 లేవీయులను జ్వేష్ఠ కుమారులుగా పరిగణించారని గుర్తుంచుకోండి. డోజ్ మాన్ ఈ సంఘటనలను సంగ్రహించాడు:6
(1) సమయం: అర్ధరాత్రి గురించి, (2) అంశము: ఐగుప్తులో ప్రథమ సంతానం, (3) అవకాశం: దేశమంతటా, మరియు (4) ఫలితం: వేదనతో కూడిన గొప్ప కేకలు; అమాయక పిల్లలు చనిపోవుట (వ. 6).
నిర్గమకాండము 11:6: "అప్పుడు ఐగుప్తు దేశమంతటా మునుపెన్నడూ లేనివిధంగా, లేదా మరలా ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప వేదన ఉంటుంది." ఇది నాకు నోవహు మరియు ఇంద్రధనస్సు గురించి ఆలోచించేలా చేస్తుంది. న్యాయమైన దేవుడు యాదృచ్ఛికంగా తొలిచూలు పిల్లలను ఎలా చంపగలడని చాలామంది ప్రశ్నించారు. కాన్స్టేబుల్ ఐదు సాధ్యమైన
వాదనలను అందించాడు:7 (1) దేవుడు ఏది చేసినా సరైనది ఎందుకంటే ఆయన దేవుడు; (2) దేవుడు జీవం పోసేవాడు మరియు ఇచ్చేవాడు, కాబట్టి అతను ఏ జీవి నుండి అయినా జీవాన్ని ఉపసంహరించుకోవడంలో నీతిమంతుడు; (3) దేవుడు ప్రాణాన్ని తీసుకోగలడు అలాగే ఇవ్వగలడు; (4) మానవులు పాపులు మరియు పాపం మరణానికి దారి తీస్తుంది, కాబట్టి దేవుడు ప్రజలను శిక్షించడంలో న్యాయంగా ఉంటాడు; మరియు (5) దేవుడు పిల్లలందరినీ చంపలేదు.
నిర్గమకాండము 11:7: "యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యుల మీద గాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు." ఇశ్రాయేలు రక్షింపబడబోతోంది. కానీ ఐగుప్తు కొరకు ప్రథమ సంతానం కూడా పోయింది. ఈ ప్రక్రియలో దేవుడు సంతానాన్ని అందించబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మొదటి సంతానమైన మగవారిని దాటి వెళ్ళబోతున్నాడు.
నిర్గమకాండము 11:8: మోషే తీవ్ర కోపంతో ఫరో సన్నిధిని విడిచిపెట్టాడు. నేను కోపం గురించి ఆలోచించినప్పుడు, నేను ఆలయంలో యేసు కోపం గురించి ఆలోచిస్తాను. అది నీతియుక్తమైన కోపం అని గ్రంథం చెబుతోంది. ఈ కోపం కూడా న్యాయమైనదని నేను భావిస్తున్నాను. జరుగుతున్న దుర్మార్గానికి మోషే జబ్బుపడ్డాడు. ఈ ఉదంతానికి అదనంగా, ఇతర సమయములలో మోషే అనేక సార్లు కోపాన్ని చూపించాడు, కానీ ఎల్లప్పుడూ స్పష్టమైన ఆలోచనతో ఉన్నాడు.8 నిర్గమకాండము 16:20లో, ఇశ్రాయేలీయులు ఒక రోజు విలువైన మన్నాను సేకరించినప్పుడు అతను కోపంగా ఉన్నాడు. లేవీయకాండము 10:16లో, బలులు సరిగా చేయనప్పుడు అతడు అహరోను కుమారులపై కోపంగా ఉన్నాడు. సంఖ్యాకాండము 16:15లో, కోరహు కుమారులు అతని నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అతనికి కోపం వచ్చింది. కాని మోషే ఒక్కసారి మాత్రమే తీవ్రమైన కోపంతో ఉన్నాడు. సంఖ్యాకాండము 20:10-12లో, ఫిర్యాదు చేస్తున్న ఇశ్రాయేలీయుల కోసం నీటిని తోడేందుకు కోపంతో మెరీబాలోని బండను కొట్టాడు. ఈ సందర్భంలో, మోషే కోపం దేవుడు తన పవిత్రతను చూపించకుండా నిరోధించింది, కాబట్టి మోషే ఇశ్రాయేలును వాగ్దాన దేశంలోకి నడిపించడానికి అనుమతించబడలేదు.
పాపం ఉన్నప్పుడు, కొన్నిసార్లు కోపంగా ఉండటం సహజమే. ఏ సమయంలో నీలో నీతిమంతమైన కోపం ఏర్పడుతుంది? సంఘము దానిని ఎప్పుడు పొందబోతోంది? మనం చేస్తున్నది మన సంస్కృతిని సమూలంగా ప్రభావితం చేయడం లేదని ఎప్పుడు ఒప్పుకుంటాం? మనము ప్రభువు కొరకు మన జీవితాలను విడిచిపెట్టము! నేను కొన్నిసార్లు చెప్పాలనుకుంటున్నాను, "సంఘమా, మీ హృదయాలను మెత్తన చేసుకోండి"! నేను అమెరికాలోని ఫరోల మీద కోపంగా ఉన్నాను. నేను దేవుని కదలికకు సిద్ధంగా ఉన్నాను. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీరు అయన కోసం అన్నింటినీ వదులుకున్నారని చెప్పగలరా?
నిర్గమకాండము 11:9-10: మోషే మరియు అహరోనులు చేసిన అద్భుతాలలో దేవుని శక్తిని ఫరో చూసినప్పటికీ, అతను ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వడానికి నిరాకరించాడు. ప్రజలు విననప్పుడు అది నాకు ఏమి ఆశను ఇస్తుందో మీకు తెలుసా? దేవుడు తన శక్తిని చూపించగలడు మరియు ఆయమ మహిమపరచబడతాడు. దేవుడు తన శక్తిని ప్రదర్శించడాన్ని నేను చూడాలనుకుంటున్నాను. మోషే మరియు అహరోనులు విధేయత చూపించారు.
ముగింపు
సైల్‌హామర్ ఇలా అన్నాడు, “అయితే, చివరి ప్లేగు ద్వారా, రచయిత నిర్గమకాండము కథనాలను మొత్తం పంచగ్రంథాలు మరియు ముఖ్యంగా ఆదికాండము యొక్క ప్రారంభ అధ్యాయాల యొక్క పెద్ద అల్లిక పనిలోకి తీసుకురాగలడు. మరణ తీర్పు మధ్యలో వాగ్దానం చేయబడిన సంతానానికి దేవుడు రక్షణ మార్గాన్ని అందించాడు (ఆదికాండము 3:15). హానోకు (ఆదికాండము 5:22-24), నోవహు (ఆదికాండము 6:9), మరియు లోతు (ఆదికాండము 19:16-19) వలె, దేవుని మార్గంలో నడిచే వారు మరణం మరియు నాశనము నుండి రక్షించబడతారు.
సంతానాన్ని విమోచిస్తానన్న తన వాగ్దానాన్ని దేవుడు గౌరవించాడు మరియు అది ఒక విశిష్టమైన రీతిలో రాబోతోంది-పస్కా. దేవుడు ఇశ్రాయేలీయులను దాటి, తన ప్రజలను రక్షించి, ఐగుప్తీయులకుపడగొట్టాడు.
1 బ్రెవార్డ్ S. చైల్డ్స్, ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ (లూయిస్‌విల్లే, KY: వెస్ట్‌మిన్‌స్టర్ జాన్ నాక్స్ ప్రెస్, 1974, 2004), పేజి. 161.విక్టర్ P. హామిల్టన్, ఎక్సోడస్: యాన్ ఎక్జిజిటికల్ కామెంటరీ (గ్రాండ్ రాపిడ్స్: బేకర్ పబ్లిషింగ్ గ్రూప్, 2011), పేజి. 165–166.
హామిల్టన్, p. 167.
ఎర్ల్ రాడ్‌మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్, 1999), pp. 105–106.
థామస్ కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్ ఎక్స్‌పోజిటరీ (అధ్యయనం) గమనికలు: ఎక్సోడస్ (https://planobiblechapel.org/tcon/notes/pdf/exodus.pdfలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది), పే. 99.
థామస్ B. డోజ్‌మాన్, ది ఎర్డ్‌మాన్స్ క్రిటికల్ కామెంటరీ: ఎక్సోడస్ (గ్రాండ్ రాపిడ్స్: Wm. B. ఈర్డ్‌మాన్స్ పబ్లిషింగ్ కో., 2009), p. 249.
కాన్స్టేబుల్, పేజి. 100-101.
హామిల్టాన్, పేజి. 168.
ప్రశ్నలు
-
నిర్గమకాండము 11:7లో, తాను ఐగుప్తు మరియు ఇశ్రాయేలుల మధ్య వ్యత్యాసాన్ని చూపినట్లు వారు తెలుసు కోవాలని ప్రభువు కోరుకున్నాడు. నిర్గమకాండములోని మొదటి 11 అధ్యాయాలలో వివరించబడిన అనేక "వ్యత్యాసాలు" ఏమిటి?
దినవాక్యం
Laura Martin Exodus 11:9
“The LORD had said to Moses, ‘Pharaoh will refuse to listen to you, so that My wonders may be multiplied in the land of Egypt.’”
ఐగుప్తును తొమ్మిది తెగుళ్లు బాధించిన తర్వాత కూడా ఫరో హృదయం కఠినంగానే ఉంది. అతను ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. ఐగుప్తు దేశంలో తొలిచూలు సంతానం అందరినీ చంపే పదవ మరియు చివరి తెగులు గురించి ప్రభువు మోషేకు సూచనలు ఇచ్చాడు. పరిస్థితి మధ్యలో ప్రభువు తన శక్తిని మరియు నియంత్రణను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు.
అదే విధంగా, ఈ జీవితంలో మీకు పరీక్షలు ఉంటాయి మరియు బాధపడతారు అని ప్రభువు చెప్పాడు. అయినప్పటికీ, క్రీస్తులో మిమ్మల్ని పునరుద్ధరించడానికి, ధృవీకరించడానికి, బలోపేతం చేయడానికి మరియు స్థాపించడానికి ఆయన మీ జీవితంలో ఈ సమయాలను ఉపయోగిస్తాడు. ప్రభువు ప్రపంచాన్ని జయించాడని విశ్వసిస్తూ కష్టాల మధ్య మీరు ధైర్యంగా ఉండండి. అతను మీలో పని చేస్తున్నాడు కాబట్టి మీరు మరింత తట్టుకునే శక్తి కలిగి ఉంటారు.
“అప్పుడు యెహోవా - ఐగుప్తుదేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.”
— నిర్గమ కాండము 11:9
తదుపరి లేఖన భాగములు
- యోహాను 16:33 — “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”
- యాకోబు 1:2–3 — “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.”
- 1 పేతురు 5:10 — “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.