Paul's Letters Colossians

The Firstborn

యేసును ఇలా కనుగొనండి: Firstborn Colossians 1 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 548వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

కొలస్సీ నగర నివాసులుగా పేరుపొందిన కొలస్సీయులకు పౌలు వ్రాసిన పత్రికలతో పాటుగా మనం చూస్తూనే ఉన్నాము. కొలస్సీను సందర్శింటకు పౌలు మంచి అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ సందర్శించలేదు. . ఈ పత్రికను కొలస్సీలోని సంఘము మరియు లవొదికయలోని పొరుగు సంఘము వారు ఇది చదవాలి (కొలస్సీ 4:16). పౌలు క్రీ.శ. 60–62లో రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు కొలస్సీయులు మరియు ఫిలేమోను రాశాడు (కొలస్సియులు 4:3, 10, 18; ఫిలేమోను 1, 9, 10, 23).1 కొలస్సియులు మరియు ఫిలేమోను ఒకే వ్యక్తుల గురించి ప్రస్తావించారు: తిమోతి, అరిస్తార్కు, ఆర్కిప్ప, మార్కు, ఎపఫ్రా, లూకా, ఒనేసిము మరియు దేమా 2. పౌలు పరిచర్య చేసి దాని చేత చుట్టుముట్టబడ్డాడు.

కొలస్సీ పట్టణము ఇప్పుడు ఆధునిక టర్కీలో ఉంది. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, “ప్రకటన 1—3లోని ఏడు సంఘములలో ప్రాంతంలో కొలస్సీ ఎఫెస్సీకి తూర్పున 100 మైళ్ల దూరంలో ఉంది.”3 ఈ పట్టణము లోయలు మరియు పర్వతాలతో చుట్టుముట్టబడిన లైకస్ నది పక్కనే ఉంది. కొలస్సీ పట్టణము ఐదవ శతాబ్దంలో నల్ల ఉన్ని మరియు రంగుల తయారీదారుగా అభివృద్ధి చెందుతున్న పట్టణం మరియు వాణిజ్య మార్గాలలో ప్రధాన కూడలి. పౌలు కాలంలో అన్యజనులు ప్రధానంగా లవొదికయ మరియు చుట్టుపక్కల స్థిరనివాస ప్రాంతం గుండా ప్రధాన మార్గంలో నివసించేవారు. ఇది గమనించడం ముఖ్యం ఎందుకంటే యూదులు మరియు అన్యుల మిశ్రమ జనాభాతో మతవిశ్వాసములు తలెత్తడానికి ఎక్కువ అవకాశం ఉంది. క్రైస్తవ మతం యొక్క కొత్త బోధనలతో యూదుల న్యాయవాదం మరియు అన్యమత మార్మికవాదం కలపడానికి ఒక శోధన ఉండేది.4

ఎఫెస్సీలో పౌలు మూడు సంవత్సరాల మిషనరీ ప్రయాణంలో కొలస్సీ వద్ద సంఘము ప్రారంభించబడింది. ఈ సంఘము పౌలు చేత స్థాపించబడలేదు కానీ ఎపఫ్రా (కొలస్సీ 1:5-7) స్థాపించాడు, పౌలు ఎఫెసులో బోధిస్తున్నప్పుడు క్రీస్తును ఎపఫ్రా అంగీకరించాడు. సంఘము స్థాపించబడిన చాలా సంవత్సరాల తరువాత, జ్ఞాన భోధల ప్రమాదము సంఘములో తలెత్తింది. సంఘము ద్వారా వ్యాపించే ప్రధాన అబద్ద భోధల విశ్వాసం, “దేవుడు మంచివాడు, కానీ పదార్థం/విషయం చెడ్డది, యేసుక్రీస్తు కేవలం దేవుని నుండి వచ్చిన ఉద్గారాలలో ఒకడు మరియు దేవుని కంటే తక్కువగా ఉన్నాడు (ఆయన నిజమైన మానవత్వాన్ని తిరస్కరించడానికి వారిని నడిపించిన నమ్మకం), మరియు జ్ఞానోదయం మరియు రక్షణకు లేఖనలపైన ఉన్న రహస్యమైన, ఉన్నతమైన జ్ఞానం అవసరం.”5

కొలస్సీలోని సంఘము వారి ప్రాథమిక విశ్వాసాలలో యూదుల న్యాయవాదాన్ని కూడా చేర్చింది. కొలస్సీయులు “రక్షణ కోసం సున్నతి యొక్క ఆవశ్యకతను, పాతనిబంధన ధర్మశాస్త్రం (ఆహార ధర్మాలు, పండుగలు, విశ్రాంతి దినము) మరియు కఠినమైన సన్యాసాన్ని పాటించడం" వంటి వాటిని స్వీకరించారని మాక్‌ఆర్థర్ వ్రాశాడు.6 ఎపఫ్రా కొలస్సీ సంఘము యొక్క దిశను కనుగొన్నాడు, అతను పౌలు నుండి ఉపదేశాన్ని మరియు సలహాను పొందేందుకు రోమాకు వెళ్లాడు. ఇది సమర్పణ మరియు శిష్యత్వానికి సంబంధించిన చక్కని చిత్రం.

ఎఫెసీ, ఫిలిప్పీ మరియు ఫిలేమోనులతో పాటు కొలొస్సయులకు పత్రికలు చెరసాల పత్రికలుగా పేర్కొనబడ్డాయి, ఎందుకంటే పౌలు రోమాలో ఖైదు చేయబడిన సమయంలో వాటిని వ్రాసాడు. కొలొస్సీయులు ఎదుర్కొన్న మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా వ్రాయబడింది. ఎపఫ్రా పత్రికను తిరిగి తీసుకురాలేదు గాని; బదులుగా, తుకీకు మరియు ఒనేసీము దానిని తీసుకు వచ్చారు. ఒనేసీము పారిపోయిన బానిస, అతను కొలొస్సి సంఘ సభ్యుడు తన యజమానుడైన ఫిలేమోను వద్దకు తిరిగి వచ్చాడు.7

మేము ప్రతి పుస్తకానికి ఉపయోగించే ఒక పదం ఎల్లప్పుడూ ఉంటుంది. కొలొస్సయులకు మనం వాడుతున్న పదం జ్యేష్ట సంతానము .

పాఠము

కొలొస్సయులు 1:1-14: నేను మొదటి 14 వచనాలపై బోధించబోవడం లేదు. పౌలు యొక్క శుభములు మొదటి కొన్ని వచనాలలో ఉంది. తర్వాత 3-8 వచనాలలో పౌలు కృతజ్ఞతను వ్యక్తం చేశాడు మరియు సంఘమునకు చాలా అభినందనలు తెలిపాడు. 9-14 వచనాలలో పౌలు ప్రార్థన చేశాడు. ఈ వచనాలు ఒక ఉత్తేజపరిచే పదం మరియు ప్రోత్సాహం వలె ఉపయోగపడతాయి. మిగిలిన అధ్యాయంలో మతవిశ్వాశాల గురించి ప్రస్తావించడానికి ఒక మార్పు వస్తుంది.

కొలొస్సయులు 1:15-23: ఈ వచనాలు క్రీస్తు దేవుని గురించినవి. యేసు నిజంగా దేవుడా కాదా అని కొలొస్సయులు ప్రశ్నించారు. గుర్తుంచుకోండి, జ్ఞానవాదం క్రీస్తు దేవునిని తిరస్కరించింది. కానీ యేసు దేవుడు. ఇక్కడ గ్రీకులో ఉపయోగించబడిన “చిత్రము” (వ. 15) అనే పదానికి అర్థం ఒకేవిదముగా లేదా పోలిక అని కూడా అర్థం. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, “యేసుక్రీస్తు పరిపూర్ణమైన ప్రతిరూపం-ఖచ్చితమైన సారూప్యత-దేవుని రూపంలో ఉన్నాడు (యోహాను 1:14; 14:9; ఫిలిప్పీయులు 2:6, cf.), మరియు నిత్యత్త్వం నుండి మారని వాడిగా ఉన్నాడు. . . [యేసు] దేవునికి ప్రాతినిధ్యం మరియు స్వారూప్యత రెండూ అని పౌలు నొక్కిచెప్పాడు. . . ఆయన అన్ని విధాలుగా సంపూర్ణ దేవుడు.”8

15వ వచనంలో ఉపయోగించిన జ్యేష్ట సంతానము అనే పదంపై మనం దృష్టి పెట్టాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, "ప్రధమ సంతానం అనే గ్రీకు పదం కాలక్రమానుసారంగా మొదట జన్మించిన వ్యక్తిని సూచిస్తుంది, కానీ చాలా తరచుగా స్థానం లేదా హోదాలో ప్రాధాన్యతను సూచిస్తుంది."9 గ్రీకు మరియు యూదా సంస్కృతిలో పౌలు దీనిని వ్రాస్తున్నాడు, “జ్యేష్ట సంతానం” అనేది జన్మ క్రమంతో సంబంధం లేకుండా వారసత్వంగా మిగిలిపోయిన కుమారుడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు దేశం “మొదటి దేశం”గా పరిగణించబడుతుంది. వారు ఉనికిలో ఉన్న మొదటి దేశం కానప్పటికీ, వారు దేవునిచేత ఎన్నుకున్న ప్రజలు (నిర్గమకాండము 4:22; యిర్మీయా 3:19).10

మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, “ఈ సందర్భంలో మొదట జన్మించడం అంటే అత్యున్నత శ్రేణి అని అర్థం, మొదట సృష్టించబడినది కాదు (cf. కీర్తన 89:27; ప్రకటన 1:5) అనేక కారణాల వల్ల: (1) క్రీస్తు “మొదటి అద్వితీయ” మరియు "ఒకే అద్వితీయ సంతానం" రెండూ కాదు (cf. యోహాను 1:14, 18; 3:91, 3:16). (2) “మొదటి సంతానం” తరగతిలో ఒకటి అయినప్పుడు, తరగతి బహువచన రూపంలో ఉంటుంది, (cf. వ.18; రోమా ​​8:29), కానీ ఇక్కడ “సృష్టి” అనే తరగతి ఏకవచన రూపంలో ఉంటుంది. (3) క్రీస్తు సృష్టించబడిన జీవి అని పౌలు బోధిస్తున్నట్లయితే, అతను తిరస్కరించడానికి వ్రాసిన మతవిశ్వాశాలతో ఏకీభవిస్తున్నాడు. (4) క్రీస్తు సృష్టించబడడం మరియు ప్రతిదానికీ సృష్టికర్త కావడం అసాధ్యం (వ. 16). కాబట్టి, యేసు ప్రథమపురుషుడు, అంటే ఆయనకు ప్రాధాన్యత ఉంది (వ. 18) మరియు ‘సర్వ సృష్టిపై’ వారసత్వ హక్కును కలిగి ఉన్నాడు (cf. హెబ్రీయులు 1:2; ప్రకటన 5:1–7, 13).”11

ముగింపు

దేవుడు క్రీస్తు ద్వారా సమస్థ సృష్టిని సృష్టించాడు. దేవుడు తన శరీరాన్ని మన కొరకు సమర్పించాడు కాబట్టి మనం క్షమించబడవచ్చు. మేము ఈ అధ్యాయములో కేవలము కొన్ని విషయాలను మాత్రమే చూసాము. ఇది మీరు క్రీస్తు మరియు ఆయన దైవత్వమును గురించి మరింత అధ్యయనం చేయడం ప్రారంభించగల చిత్రాన్ని చిత్రీకరిస్తుందని ఆశిస్తున్నాము.

  1. జాన్ మాక్‌ఆర్థర్, ది మాక్‌ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషింగ్, 2005), పే. 1729.

  2. మాక్‌ఆర్థర్, పే.1729.

  3. మాక్‌ఆర్థర్, పే.1729.

  4. మాక్‌ఆర్థర్, పే.1729.

  5. మాక్‌ఆర్థర్, పే.1729.

  6. మాక్‌ఆర్థర్, పే.1729.

  7. మాక్‌ఆర్థర్, పే.1730

  8. మాక్‌ఆర్థర్, పే. 1733-34

  9. మాక్‌ఆర్థర్, పే. 1733-34

  10. మాక్‌ఆర్థర్, పే. 1733

  11. మాక్‌ఆర్థర్, పే. 1733-34

ప్రశ్నలు

  1. కొలొస్సయులు 1:7–9లో, కొలస్సీలోని సంఘము గురించి ఎపఫ్రా నుండి తనకు వచ్చిన వార్తలకు పౌలు ప్రతిస్పందన ఏమిటి? వారి కోసం ప్రత్యేకంగా ఏమి ప్రార్థించాడు? (కొలొస్సయులు 1:9–12)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Colossians 1:16–17

“For everything was created by Him, in heaven and on earth, the visible and the invisible, whether thrones or dominions or rulers or authorities—all things have been created through Him and for Him. He is before all things, and by Him all things hold together.”

కొన్నిసార్లు ఈ వెర్రి ప్రపంచంలో సత్యము అస్పష్టంగా మారినప్పుడు, మీరు మళ్లీ దృష్టి పెట్టాలి. అసలు సత్యము ఏమిటి? మీరు విశ్వసించే దాన్ని బలపరచడానికి మరియు స్థాపించడానికి దేవుని వాక్యానికి తిరిగి వెళ్లండి. పౌలు కొలస్సీ సంఘముతో ప్రాథమిక విషయాలకు తిరిగి వెళ్ళాడు. ఆయన సమస్థ సృష్టిని సృష్టించాడు కాబట్టి క్రీస్తు సర్వోన్నతుడని పౌలు నొక్కిచెప్పాడు. అవును, ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

మీ జీవితంలో విషయాలు విపరీతంగా అనిపించినప్పుడు, సమస్త సృష్టి కంటే ప్రధమ/జ్యేష్ట సంతానమైన క్రీస్తు అన్నిటికంటే ముందు ఉన్నాడు మరియు ఆయన ద్వారా సమస్థమును కలిగెను అని జ్ఞాపకముంచుకోనుడి. గుర్తుంచుకోవలసిన సత్యం: యేసు సమస్థమును సమకూర్చి ఉంచాడు. ఆయన గందరగోళ పరిస్థితులలో ఉన్నాడు. ఆయన ఆనందంలో ఉన్నాడు. యేసు అన్ని సమయాలలో అన్నింటినీ సమకూర్చి ఉంచుతాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి యున్నాడు మరియు ఆయన సమస్థమును సృష్టించాడు కాబట్టి ఆయన సమస్థమును సృష్టించిన వాడు. మీ జీవితంలో దేవుడు అన్నిటినీ కలిపి ఉంచుతున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించండి. దేవుడు మీ జీవితానికి జిగురుగా మరియు రబ్బర్ బ్యాండ్‌గా ఉంటాడని నమ్మండి. ఆయన మీతో ఉన్నాడు, మీ జీవితంలో అన్నింటినీ కలిపి ఉంచాడు ఎందుకంటే మీ పట్ల ఆయన ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు.

“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.”

  • కొలస్సీయులకు 1:16-17

తదుపరి లేఖనభాగము

యోహాను 1:2-3:- “ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.”

రోమీయులకు 8:28:- “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”

హెబ్రీయులకు 1:1-3:- “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై,”