The Holy Spirit Promised, Jesus' Ascension, Matthias Chosen
యేసును ఇలా కనుగొనండి: Authority Acts 1 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
అపొస్తలుల కార్యముల పుస్తకం బైబిల్ యొక్క సంతోషకరమైన పుస్తకం. చాలా మంది ప్రజలు అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని ఇష్టపడతారని చెబుతారు, ఎందుకంటే ఆ కాలంలో దేవుడు చేసిన వాటిని వినడానికి వారు ఇష్టపడతారు. కానీ దేవుడు ఈ రోజు కూడా అదే చేయగలగుటను మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తకంలో, మనలో నివసించే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాము. అపొస్తలుల జీవితాల్లో ఆయన ఎలా సజీవంగా వచ్చాడో మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో ఆయన ఎలా జీవిస్తాడో మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకంలో జరిగినదంతా యేసు దానిని చేయడానికి అధికారం ఇచ్చాడు కాబట్టి జరిగింది.
యేసు వారికి అధికారం ఇచ్చాడు కాబట్టి అపొస్తలులు తమకు అధికారం ఇచ్చిన దాని ద్వారా నడవవచ్చు. మత్తయిలో, యేసుకు మనం ఉపయోగించిన పదం రాజు. మార్కులో పదం సేవకుడు. లూకాలో, ఆయన మనుష్యు కుమారుడు, మరియు యోహానులో, అతను దేవుని కుమారుడు.
మత్తయి 28:18లో, యేసు తన ప్రణాళికను అపొస్తలులకు వివరించాడు మరియు పరలోకము మరియు భూమిపై సమస్త అధికారము తనకు ఇవ్వబడ్డాయని చెప్పాడు. యేసు అధికారం పరిమితం కాదు. అపొస్తలుల కార్యముల గ్రంథానికి, మన పదం అధికారం. యేసు తన అధికారాన్ని స్థాపించిన తరువాత, సమస్త దేశాలకు వెళ్లి శిష్యులను చేయమని శిష్యులకు చెప్పాడు (మత్తయి 28:19-20). మనం వెళ్లడాన్ని అర్థం చేసుకున్నప్పుడు, యేసుకు అధికారం ఉందని మనం అర్థం చేసుకుంటాము-మరియు ఆయన దానిని మనకు ఇస్తాడు, ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనకు అధికారాన్ని ఇచ్చాడని అపొస్తలుల కార్యముల పుస్తకం చూపిస్తుంది. కొన్నిసార్లు, పరిశుద్ధాత్మ మనకు ఇచ్చే విషయాలు మనకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ ఆయన నుండి మాత్రమే వచ్చే అధికారం మరియు సాధికారత మనకు అవసరం. మనము అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, పాత నిబంధనలోని అన్ని అంశాలను మనం గ్రహిస్తాము.
అపొస్తలుల కార్యములు అనే పుస్తకము లూకా రాసిన రెండవ సంపుటి, అతను లూకా సువార్తను కూడా వ్రాసాడు. లూకా సువార్త వలె, అపొస్తలుల కార్యములు థియోఫిలాకు వ్రాయబడ్డాయి (అపొస్తలుల కార్యములు 1:1). మొదటి 12 అధ్యాయాలు ప్రధానంగా పేతురు మరియు సంఘము గురించి ఉన్నాయి. 13-28 అధ్యాయాలలో, ప్రధాన పాత్రదారి పౌలు. మీరు ఈ పుస్తకం యొక్క శీర్షిక "పరిశుద్ధాత్మ యొక్క కార్యములు"తో మీరు వెళ్ళుచుండగా జాన్ మాక్ఆర్థర్ చెప్పినట్లుగా, అది "ఆత్మ నిర్దేశము, నియంత్రణ మరియు సాధికారత కలిగిన పరిచర్య సంఘమును బలపరిచింది మరియు అది సంఖ్యాపరంగా వృద్ధి చెందడానికి, ఆత్మీయ శక్తికి , మరియు ప్రభావమునకు కారణమైంది.1 రచయితయైన లూకా, గ్రంథంలో మూడు సార్లు వివరించబడ్డాడు. కొలొస్సయులు 4:13లో, లూకా “ప్రియమైన వైద్యుడు” అని వర్ణించబడ్డాడు. 2 తిమోతి 4:11లో, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు లూకా పౌలుతో ఉన్నాడు. అపొస్తలుల చర్యలను నమోదు చేయడానికి లూకా ఎల్లప్పుడూ ఉండాల్సిన అవసరం ఉంది. ఫిలేమోను 1:24లో, పౌలు తన సహోద్యోగులలో లూకా ఒకడని మళ్లీ పేర్కొన్నాడు. లూకా ఒక వైద్యుడు కాబట్టి, అతను బహుశా అధారములతో వివరించాడు. అతను పౌలు యొక్క సన్నిహిత స్నేహితులలో ఒకడు, ప్రయాణ సహచరుడు మరియు వ్యక్తిగత వైద్యుడు. లూకా 1:1-4లో, లూకా చాలా జాగ్రత్తకలిగిన పరిశోధకుడిగా వర్ణించబడ్డాడు. యెరూషలేము సంఘములో భాగమైన పేతురు, యోహాను, మరియు ఇతరులను లూకా ఇంటర్వ్యూ చేశాడు. పౌలు రెండు సంవత్సరాలు జైలులో ఉండగా, లూక ఫిలిప్పు మరియు అతని కుమార్తెలను ఇంటర్వ్యూ చేసాడు.2 అపొస్తలుల కార్యముల అంతటా, ఇందులో భాగం లేదా అందులో భాగమని లూకా వ్రాసిన అనేక "మేము" అనే పదములు ఉన్నాయి. కాబట్టి లూకా ప్రజలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా, లూకా పాల్గొన్న కాలములు కూడా ఉన్నాయి.
క్రీ.శ. 60 నుండి క్రీ.శ. 62 వరకు పౌలు యొక్క మొదట సారి రోమాలో చెరసాల ముగియడానికి ముందే అపొస్తలుల కార్యములు వ్రాయబడి ఉండవచ్చు, ఎందుకంటే యెరూషలేము సంఘ అధిపతి అయిన యాకోబు హతసాక్షియగుట గురించి లూకా వ్రాయలేదు. యేసు ఇక్కడ భూమిపై చేసిన పనుల గురించి థియోఫిలాకు వివరించడానికి లూకా రాశాడు. ఈ ప్రక్రియలో, లూకా యేసు యొక్క ఆరోహణము, పెంతెకోస్తు, సంఘము యొక్క ప్రారంభం మరియు పెరుగుదలను వివరించాడు. సమస్త కాలములలో కంటే ఎక్కువగా జరిగిన అత్యంత ప్రత్యేకమైన ఉజ్జీవాన్ని లూకా చూశాడు. అపొస్తలుల కార్యములలో సంఘము యొక్క అభివృద్ధిని మనం చూసినప్పుడల్లా, వ్యతిరేకతను కూడా చూస్తాము. అపొస్తలుల కార్యముల పుస్తకంలో లూకా నమోదు చేసినది గొప్ప ఆజ్నకు ప్రారంభ ప్రతిస్పందన (మత్తయి 28:18-20). 12 మంది వ్యక్తులు తమ జీవితం గురించి చింతించకపోవడమే కాకుండా, వారికివ్వబడిన ఆజ్నతో జీవించడం వల్ల, మనం యేసు గురించి విన్నాము మరియు ఆయన మనకు ఇచ్చే అధికారముతో నడుస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ యేసు అని అపొస్తలుల కార్యముల పుస్తకం నొక్కి చెబుతోంది. అపొస్తలుల కార్యముల పుస్తకంలో యేసు నిజంగా ఇశ్రాయేలీయుల నిరీక్షణ అయ్యాడు. అపొస్తలుల కార్యముల పుస్తకం పాత నిబంధన నుండి విస్తృతంగా వ్యాఖ్యానించబడినది. లూకా తన ఖాతాను తిరిగి యోవేలుకు, కీర్తనలకు మరియు యెషయాలనుండి తీసుకున్నాడు. ఉదాహరణకు: అపొస్తలుల కార్యములు 2:35 కీర్తన 110:1 నుండి తీసుకోబడింది. మనం ఇప్పుడు కొత్త నిబంధన మరియు కొత్త ఒడంబడికను అధ్యయనం చేస్తున్నందున యేసు పాత నిబంధనను తుడిచిపెట్టాడని దీని అర్థం కాదు. బదులుగా, యేసు ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలను నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు - కొట్టివేయడానికి లేదా నాశనం చేయడానికి కాదు (మత్తయి 5:17).3
పాఠము
అపొస్తలుల కార్యములు 1:1-3: లూకా తన మొదటి రచనలో (లూకా సువార్త) వివరించిన దానిని తిరిగి పొందుపరిచాడు. అతను ఈ రచనను ప్రారంభించినప్పుడు, యేసు శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆపై నలభై రోజులు శిష్యులకు కనిపించాడు అని లూకా నొక్కిచెప్పాడు. యేసు తాను సజీవంగా ఉన్నాడని “అనేక నమ్మదగిన రుజువులను” అందించాడు మరియు దేవుని రాజ్యం గురించి శిష్యులతో మాట్లాడాడు. ఈ రోజు మనం చెప్పవలసిన సందేశం ఇదే. మన గురించి లేదా మన గోత్రముల గురించి కాకుండా దేవుని రాజ్యం గురించి మనం ఎక్కువగా మారాలి.
అపొస్తలుల కార్యములు 1:4-5: యేసు ఈ 40 రోజులు శిష్యులతో ఉన్నప్పుడు, యెరూషలేమును విడిచి వెళ్లవద్దని ఆయన వారికి చెప్పాడు. యేసు చంపబడిన యెరూషలేము నుండి వారు బహుశా ఆ ఆజ్ఞను ప్రశ్నించవచ్చు, కాని తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు వేచి ఉండాలని యేసు చెప్పాడు. వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకుంటారనే దేవుని వాగ్దానం గురించి యేసు వారికి చెప్పాడు. లూకా 11:13లో, దేవుడు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడని యేసు వివరించాడు. లూకా 24:49లో, ఆయన మృతులలో నుండి పునరుత్థానం చేయబడిన తర్వాత, "నా తండ్రి వాగ్దానం చేసిన దానిని నేను మీకు పంపుతున్నాను" అని యేసు చెప్పాడు. యేసు మరియు ఆయన తండ్రి తమకు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని ఇచ్చే వరకు వారు యెరూషలేములో వేచి ఉండాలనే స్థిరమైన సందేశాన్ని శిష్యులు విన్నారు.
అపొస్తలుల కార్యములు 1:6-8: యేసు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరించాలని అనుకున్నాడో లేదో శిష్యులు తెలుసుకోవాలనుకున్నారు. యేసు రాజుగా పరిపాలించడంతో ఇశ్రాయేలు రాజ్యము తిరిగి స్థాపించబడడాన్ని చూడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. యెహెజ్కేలు 36 మరియు యోవేలు 2వ అధ్యాయములు శిష్యులకు తెలుసు, రాజ్యం యొక్క రాకడను ఆత్మ ప్రవాహముతో అనుసంధానించారు.4 యేసు వాటిని తెలిసికొనుట మీ పనికాదని చెప్పాడు మరియు ఆయన వారిని ఏమి చేయమని పిలిచాడో దాని వైపు మళ్లించాడు. పరిశుద్ధాత్మ వారికి ఇవ్వబడినప్పుడు, వారు "యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను " (వ. 8). “సాక్షి” అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది, దీని అర్థం “తన విశ్వాసం కోసం మరణించేవాడు.”5 మనకు శక్తిని మరియు అధికారాన్ని ఇవ్వడానికి ఆత్మ వచ్చాడనే ఆయన వాగ్దానాన్ని మనం నిజంగా విశ్వసించినప్పుడు, మనం నిజంగా ఆయన కొరకు చనిపోతాము అని యేసు చెప్పాడు. కొన్ని కారణాల వల్ల, శుభవార్త తీసుకోవడం అనేది ఒక వ్యాపారం లేదా సండే స్కూల్ క్లాస్ ద్వారా చేసే ఒక అసైన్మెంట్ అని మనము భావిస్తున్నాము. వాస్తవానికి, మనం క్రీస్తు అనుచరులమైతే, మనం ఎక్కడ ఉన్నా, క్రీస్తుపై మనకున్న విశ్వాసం కోసం చనిపోయే సాక్షిగా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నారా అని అడుగబడతఅము. పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు, సజీవుడైన రాజుకు రాయబారులుగా నడవడానికి మనకు అధికారం మరియు శక్తి ఇవ్వబడతాయి; ఇంకా, మనకు అది కావాలో వద్దో మనము నిర్ణయిస్తాము. మనకు ఇవ్వబడిన అధికారముతో వడవడానికి మనము భయపడుతున్నాము.
అపోస్తలుల కార్యములు 1:9–14: అప్పుడు వారి కన్నుల యెదుటనుండి ఒక మేఘము ఆయనను కొనిపోవుటను శిష్యులు చూశారు. ఈ వాతావరణంలోకి, ఈ భూమి మీదికి సువార్తను మరియు దేవుని రాజ్యాన్ని విడుదల చేసే సాక్షులుగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క అధికారములో నడిచే అవకాశం మనకు ఉంది మరియు దానిని ఎలా చేయాలో చూపించే అద్భుతమైన నమూనా కూడా మాకు ఉంది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? (వ. 11a). మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు పరలోకానికి వెళ్లడాన్ని శిష్యులు చూసినట్లే యేసు మళ్లీ వస్తాడని తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వివరించారు. శిష్యులు యెరూషలేముకు తిరిగి వెళ్ళినప్పుడు-అర మైలు కంటే ఎక్కువ దూరంలో లేదు, వారు సబ్బాతు రోజున నడవగలిగే అత్యంత దూరం (వ. 12)-మీరు వారి సంభాషణను ఊహించగలరా? నిర్దేశించినట్లుగా, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కోసం శిష్యులు యెరూషలేములో వేచి ఉన్నారు.
అపోస్తలుల కార్యములు 1:15-26: వారు మేడ గదిలో కూడియున్నప్పుడు, శిష్యులు యూదా స్థానంలో మత్తీయను ఎన్నుకోవడానికి చీట్లు వేశారు, తద్వారా వారికి మరోసారి 12 మంది శిష్యులు ఉన్నారు.
ముగింపు
అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము చివరిలో, శిష్యులు ఆయన సాక్షులుగా ఉండేందుకు దేవుని ఆత్మ వారి మీదకు వచ్చే వరకు వేచి ఉన్నారు.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 1429
మాక్ఆర్థర్, పే. 1429.
మాక్ఆర్థర్, పేజీలు. 1429–30.
మాక్ఆర్థర్, p.1432.
మాక్ఆర్థర్, p.1433.
ప్రశ్నలు
-
అపొస్తలుల కార్యములు 1:3లో, యేసు "అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను." అని లూకా నమోదు చేశాడు. మీరు ఈ రుజువులలో కొన్నింటిని జాబితా చేయగలరా?
దినవాక్యం
Laura Martin Acts 1:8
“But you will receive power when the Holy Spirit has come on you, and you will be My witnesses in Jerusalem, in all Judea and Samaria, and to the ends of the earth.”
యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత, ఆయన పరలోకానికి వెళ్లడానికి 40 రోజుల ముందు శిష్యులకు కనిపించాడు. ఈ సమయంలో, అతను దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలపై శిష్యులకు బోధించాడు. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుతారని యేసు శిష్యులకు వాగ్దానం చేశాడు. యెరూషలేములోను, యూదయ మరియు సమరయ అంతటా మరియు ప్రపంచమంతటా తన సాక్షులుగా ఉండమని వారికి చివరి ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. ఇది చెప్పిన తర్వాత, యేసు స్వర్గానికి ఎత్తబడ్డాడు, మరియు శిష్యులు ప్రార్థనలో ఐక్యంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు.
యేసు ఇంకా తిరిగి రానందున, శిష్యులకు ఆయన వాగ్దానం మరియు చివరి సూచన నేటికీ విశ్వాసులకు నిజం. విశ్వాసిగా మీ ఉద్దేశ్యం మీ స్వంత శక్తితో కాదు, కానీ మీరు పవిత్రాత్మ నుండి శక్తిని పొందినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు గురించి సాక్ష్యమివ్వడం. మీరు కిరాణా దుకాణంలో ఉన్నా, పాఠశాలలో ఉన్నా, కుటుంబంతో కలిసి తిరుగుతున్నా లేదా ప్రపంచంలోని మరియు ఇంటికి దూరంగా ఉన్న దేశంలో ఉన్నా, యేసుకు సాక్షిగా ఉండాలన్నదే మీ సూచన. మీరు భయపడాల్సిన పనిలేదు. యేసును మృతులలో నుండి లేపిన అదే శక్తి మీలో నివసిస్తుంది. కాబట్టి, అధికారంలో కొనసాగండి. యేసే మార్గము, సత్యము మరియు జీవము అని సాక్ష్యమిచ్చుచు మీ వెలుగు అందరి యెదుట ప్రకాశింపజేయుము!
“అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.”
- అపొస్తలుల కార్యములు 1:8
తదుపరి లేఖన భాగములు
మత్తయి 28:18-20 — “అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచ నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.”
యోహాను 14:6 — “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”
రోమా 8:11 — “మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.